ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుందని చాలా మంది అంటుంటారు. కానీ ఇన్నాళ్లు ఈ విషయాన్ని కొట్టిపారేసిన వాళ్లు కూడా ఈ వీడియో చూస్తే ఎస్ ఎస్ అనక తప్పదు.
అంత దారుణంగా వ్యవహరించాడు ఈ టికెట్ క్లర్క్. ఓ వైపు ట్రైన్ వస్తుంది.. టికెట్ ఇయ్యవయ్య బాబు అని ప్యాసింజర్స్ మొత్తుకుంటుంటే.. హ్యాపీగా ఫోన్‌లో బాతాకానీ కొడుతున్నాడు. కిలోమీటర్ క్యూ ఉంది.. ఆల్రెడీ పదిహేను నిమిషాలైంది ఫోన్ మాట్లాడుతున్నవ్.. కట్ చేసి పని చూడమంటే.. సిల్లీగా నవ్వేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు సదరు ఎంప్లాయీ సి. మహేష్. కర్ణాటక యాద్గిర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. గుంతకల్ రైల్వే స్టేషన్ డివిజన్ అధికారులు క్విక్‌గా స్పందించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
































