రైతుల ఖాతాల్లోకి రూ. 20,500 కోట్లు… లిస్ట్‌లో మీ పేరు ఉందో?, లేదో? చెక్ చేసుకోండి

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్… కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20వ విడత (PM Kisan 20th Installment) నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది.


ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. పీఎం కిసాన్ యోజన నిధులను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ఆరోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని బనౌలి గ్రామంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారని… అక్కడి నుంచే రైతుల ఖతాల్లో నిధుల విడుదల చేస్తారని పేర్కొంది. తద్వారా ప్రధానమంత్రి మోదీ… దేశవ్యాప్తంగా 9.70 కోట్ల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 20,500 కోట్లకు పైగా మొత్తాన్ని జమ చేయనున్నారు.

పీఎం కిసాన్‌ యోజన పథకం కింద 20వ విడతలో రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున జమ కానున్నాయి. అయితే పీఎం కిసాన్ యోజనలో రిజిస్టర్ చేసుకన్న రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఓటీపీ ఆధారిత (మొబైల్ నంబర్) ఈ- కేవైసీ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపింది. బయోమెట్రిక్ ఆధారిత ఈ- కేవైసీ కోసం సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించాలని పేర్కొంది.

2019లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 19 విడతల ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 3.69 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 20వ విడతలో రూ. 20,500 కోట్లు 9.7 కోట్ల మంది రైతులకు బదిలీ చేయనున్నట్టుగా చెప్పారు. పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారని… జాతీయ, రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో రైతులను ఈ కార్యక్రమంతో అనుసంధానించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని, పండుగ మాదిరి జరుపుకోవాలని సూచించారు.

పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన స్టేటస్ ఎలా తెలుసుకోవాలి…
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు విడుదల చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో కూడా పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్‌లో పడ్డాయా?, లేదా? అనేది చెక్ చేసుకోవచ్చు…
>> ఇందుకోసం ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి.
>> అక్కడ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.. అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
>> దీంతో మీరు లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
>> తర్వాత స్క్రీన్‌పై పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ కనిపిస్తుంది.
>> అక్కడే ఈ కేవైసీకి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోండి…
>> ఇందుకోసం ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి.
>> ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
>> అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, మండలం, గ్రామం (మీ వ్యవసాయ భూమి ఉన్న గ్రామం) వివరాలను డ్రాప్ డౌన్ నుంచి ఎంపిక చేసుకోవాలి.
>> అనంతరం ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
>> అక్కడ గ్రామాల వారీగా లబ్దిదారుల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ సమ్మాన్ కింద నిధులకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే.. మీరు హెల్ప్‌లైన్ 155261, 011-24300606 నెంబర్‌లకు కాల్ చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.