చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్.

మెగాస్టార్ చిరంజీవి ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికీ వరుస లతో బిజీగా ఉన్న చిరు.. అటు ఫిట్నెస్ విషయంలోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు.


ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ సైతం నటిస్తుంది. మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. చిరు దశాబ్దాల సినీ ప్రయాణంలో చాలా మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

కానీ మీకు తెలుసా.. ? ఒకే హీరోయిన్ చిరుకు లవర్ గా, భార్యగా, చెల్లిగా, తల్లిగా నటించింది. చిరు ల్లో మొత్తం నాలుగు విభిన్న పాత్రలలో నటించిన ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఆమె పేరు సుజాత. ఒకప్పుడు తెలుగు ప్రపంచాన్ని ఏలిన హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలో దాదాపు 300లకు పైగా ల్లో నటించింది. అప్పట్లో ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒకప్పుడు హీరోయిన్ గా కనిపించిన ఆమె.. ఆ తర్వాత అక్క, వదిన, అమ్మ.. ఇలా సహయక పాత్రలు పోషించింది.

అయితే 1980లో కృష్ణంరాజు, చిరంజీవి కాంబోలో వచ్చిన ప్రేమతరంగాలు లో చిరు ప్రియురాలిగా కనిపించింది సుజాత. చివర్లో వీరిద్దరికి వివాహం జరగ్గా భార్యగా కనిపిస్తుంది. 1982 సీతాదేవి లో చిరుకు చెల్లిగా కనిపించింది. 1995లో బిగ్ బాస్ అనే లో చిరుకు తల్లిగా నటించింది. కానీ ఈ అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పటివరకు చిరుకు ప్రియురాలిగా, భార్యగా, చెల్లిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ సుజాత.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.