ఉద్యోగం కోల్పోయిన H1B వీసా దారులకు శుభవార్త

మెరికాలో H1B వీసాపై ఉద్యోగం చేస్తున్న భారతీయులకు ఉద్యోగం కోల్పోవడం ఒక పెద్ద సవాలు. ఉద్యోగం పోగానే 60 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు.


అయితే, ఇది పూర్తిగా నిజం కాదని సరైన చట్టపరమైన మార్గాలను అనుసరిస్తే అమెరికాలోనే కొనసాగే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ అనేది ఒక “లైఫ్‌లైన్” లాంటిదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.

ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఉన్న అవకాశాలు

ఉద్యోగం కోల్పోవడం వల్ల వీసా స్టేటస్‌పై ప్రభావం పడుతుంది. అయితే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కొన్ని చట్టబద్ధమైన మార్గాలను అందిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి.. వేరే నాన్‌ఇమిగ్రెంట్ స్టేటస్‌కి మారటం ఉదాహరణకు, టూరిస్ట్ వీసా (B2)కు మారడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా స్టేటస్‌ను మార్చడానికి లేదా సర్దుబాటు చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగదారుడి ద్వారా కొత్త H1B పిటిషన్ దాఖలు చేయించడం.. కొత్త ఉద్యోగం లభించినట్లయితే, కొత్త యజమాని ద్వారా H1B పిటిషన్ దాఖలు చేయించుకోవచ్చు. కంపెల్లింగ్ సర్కంస్టాన్సెస్ ద్వారా వర్క్ పర్మిట్ (EAD) కోసం దరఖాస్తు చేయవచ్చ. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దశల్లో ఏదైనా చర్యను 60 రోజుల్లోపు ప్రారంభిస్తే USCIS మీ స్టేటస్‌ను “ఆథరైజ్డ్ స్టే”గా పరిగణించవచ్చని, తద్వారా మీరు దేశం విడిచిపెట్టకుండా చట్టబద్ధంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

– అపోహలు వద్దు:

చాలా మంది ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ గురించి సరైన అవగాహన లేకుండా ఇంటర్నెట్‌లో లభించే అప్రమాణిత సమాచారం ఆధారంగా హడావుడిగా అమెరికా విడిచిపోతుంటారు. అయితే ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల ప్రకారం, సకాలంలో సరైన పిటిషన్ లేదా అప్లికేషన్ వేస్తే చట్టపరంగా కొనసాగవచ్చు.

-కుటుంబంపై ప్రభావం:

H1B వీసా దారులు తమ స్టేటస్ మార్చకపోతే, అది వారిపై మాత్రమే కాకుండా, H4 వీసాపై ఉన్న వారి కుటుంబ సభ్యులపైనా ప్రభావం చూపుతుంది. అందుకే నిర్ణయాలు ఆలస్యం చేయకుండా సరైన సలహా తీసుకొని ముందడుగు వేయడం చాలా ముఖ్యం.

ఏమి చేయాలి?

ఉద్యోగం పోగానే ఆందోళన చెందకుండా కొన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీసా స్టేటస్‌పై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాలి. వెంటనే ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల సలహా తీసుకోవాలి. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చురుకుగా ప్రయత్నించాలి. అవసరమైతే వేరే వీసాకి మారే దిశగా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగం కోల్పోవడాన్ని ఒక ముగింపుగా భావించకుండా కొత్త అవకాశానికి ఆరంభంగా చూడాలని, చట్టాన్ని అర్థం చేసుకుని ముందుగానే చర్యలు తీసుకుంటే అమెరికాలోనే కొనసాగవచ్చని ఇమ్మిగ్రేషన్ నిపుణులు భరోసా ఇస్తున్నారు. “జాగ్రత్తగా చట్టబద్ధంగా ఆశతో ముందుకు పోవాలి” అని వారు పిలుపునిచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.