తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. నేటి నుంచి అమల్లోకి

హోటళ్లు, రెస్టరంట్లు తదితర అవసరాల కోసం వాడే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ (Commercial LPG) ధర స్వల్పంగా తగ్గింది.


19 కేజీల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.33.50 తగ్గిస్తూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి (ఆగస్టు 1) నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. తగ్గించిన ధరతో దిల్లీలో వాణిజ్య సిలిండర్‌ రూ.1631.50గా ఉండనుంది. ఇక ఇళ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. చిన్న వ్యాపారాలకు వాణిజ్య సిలిండర్‌ ధర తగ్గింపు కొంతమేర ఉపశమనం కలిగించనుంది. రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.