Ajwain Water: శరీరంలో అన్ని రుగ్మతలకు కారణం జీవక్రియలో సమస్యే..ఆ నీళ్లే దీనికి పరిష్కారం

www.mannamweb.com


Ajwain Water:శరీరంలో జరిగే అన్ని రుగ్మతలకు సమాధానం జీవక్రియ లేదా మెటబోలిజం సరిగ్గా లేకపోవడమే. మరి మెటబోలిజంను మెరుగుపర్చే అద్భుతమైన ఔషధం గురించి తెలుసుకుందాం.
నిత్య జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవన శైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ప్రతి సమస్యకు ఆసుపత్రుల చుట్టూ పరుగెట్టాల్సిన అవసరం లేదు. వంటింట్లో లభించే అద్భుతమైన ఔషధాలతోనే చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా వాముతో చాలా అద్భుత ప్రయోజనాలున్నాయి. వాముతో ఏయే రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయనేది పరిశీలిద్దాం.

మనకు ఎదురయ్యే సకల రోగాలకు కారణం జీవక్రియ లేదా మెటబాలిజం మందగించడమే. జీవక్రియ మెరుగ్గా ఉంటే ఏ రోగాలు అంత సులభంగా దరిచేరవు. మరి ఆ మెటబాలిజంను మెరుగుపర్చేది వాము లేదా అజ్వైన్ వాటర్. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. రోజూ వాము నీరు తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు బరువు తగ్గించుకునేందుకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని జీవక్రియను వాము నీరు మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఊబకాయం నియంత్రించవచ్చంటారు వైద్య నిపుణులు.

అయితే క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాము నీరు తీసుకోవల్సి ఉంటుంది. ఒక చెంచా వాము గింజల్ని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాల్సి ఉంటుంది. ఉదయం ఆ నీటీని మరిగించి..వడపోసి తాగాలి. ఇలా చేయడం ద్వారా..వివిధ రకాల ఆరోగ్య సమస్యల్నించి దూరం చేసుకోవచ్చు.

ఇక మహిళలకు సంబంధించి తరచూ పీరియడ్స్ సమయంలో భరించలేని కడుపు నొప్పి అనేది సర్వ సాధారణంగా కన్పిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు నీటిలో వామును బాగా మరగబెట్టి చల్లార్చి తీసుకోవాలి. ఫలితంగా కడుపు నొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

వాము లేదా అజ్వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలెక్కువ. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, నికోటిన్ యాసిడ్, కార్పొహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. వామునీరు క్రమం తప్పకుండా తీసుకుంటే.. గొంతు నొప్పితో బాధపడేవాళ్ళు, నోటి నుంచి దుర్వాసన వెలువడేవారికి ఉపశమనం కలుగుతుంది.