విశాఖ స్టీల్ ప్లాంట్‌పై (Visakhapatnam Steel Plant) కేంద్రప్రభుత్వం (Central Government) ఇవాళ(శుక్రవారం ఆగస్టు1) కీలక ప్రకటన చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియపై కేంద్రం వెనక్కు తగ్గింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.































