కొత్తగా 4జీ కనెక్షన్ తీసుకునే వారికి రూ.1 కే నెలంతా అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ అధిక వేగం డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకునే వీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ పేరిట ఈ పథకాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 4జీ సదుపాయాన్ని దేశ పౌరులంతా వినియోగించేందుకే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ.రాబర్ట్ జె రవి వివరించారు. దేశమంతా లక్ష 4జీ సైట్లు నిర్మించినట్లు తెలిపారు.
































