డేంజర్ లో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం – నిపుణుల హెచ్చరిక..

టీ ఉద్యోగులకు తాజా సర్వే షాకింగ్ గా మారింది. కొంత కాలంగా ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్.. ఆర్దిక మాంద్యం ఐటీ ఉద్యోగుల పైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.


అయితే, టార్గెట్ల కోసం నిరంతరం కూర్చొని పని చేసే ఈ ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం పైన ఇప్పుడు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు దాదాపు 84 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో ఉన్నట్లు గుర్తించారు. దీంతో, వీరిని అప్రమత్తం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లివర్ సమస్యలు

హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మందికి ఫ్యాటీ లివర్ వ్యాధి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు. ప్రత్యేకంగా హైదరాబాదు, బెంగళూరు వంటి ఐటీ హబ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులలో 71 శాతం మంది ఊబకాయంతో (బరువు ఎక్కువగా ఉండటం) బాధపడుతున్నారు. 34 శాతం మందికు మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్య ఉంది. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే పరిస్థితి. ఉదాహరణకు గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, కాలేయం (లివర్) పాడయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

కారణాలు

ఐటీ ఉద్యోగులు ఎక్కువసేపు కూర్చొని పని చేయడం తో పాటుగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆరోగ్యానికి హానికరమైన ఆహారం తినడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అధిక పని ఒత్తిడితో జీవించడం వీరి ఆరోగ్యం పైన ప్రభావం చూపుతోంది. దీంతో, ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్‌లు చేపట్టింది. ముఖ్యంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ (NP-NCD). దీని కింద వివిధ రకాల జాగ్రత్తలు, స్క్రీనింగ్‌లు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన పెంచుతుంది.

సూచనలు

వ్యాయామం, బరువు నియంత్రణ గురించి ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగుల్లో పెరుగుతున్న ఈ

ఫ్యాటీ లివర్ వ్యాధులు తప్పనిసరిగా శ్రామికశక్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దీంతో, ఐటీ ఉద్యోగులకు ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అదే విధంగా ఆహారపు అలవాట్లపై జాగ్రత్త. మితంగా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచన చేసారు. ఇక, ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఉద్యోగ పరంగా ఉండే ఒత్తిడి తగ్గించుకునే అలవాట్లు ( యోగా, మెడిటేషన్) చేయాలని సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.