ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్.ఆర్.ఏ ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2022 లో పెంచిన దీనిప్రకారం అంటే రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం హౌస్ రెంట్ అలవెన్స్ 24 శాతం మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


01-07-2025 నుండి 30-06-2026 వరకు సెక్రటేరియట్ మరియు డిపార్ట్మెంట్ హెడ్స్ కు వర్తించనుంది.

గరిష్టంగా ఇరవై ఐదువేలు…

ఈ నిర్ణయంతో గరిష్ఠంగా 25,000 రూపాయలవరకు హెచ్ఆర్ఏ లభించనుంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు 12వ పీఆర్సీ రిపోర్ట్ రాకముందే.. ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.