పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌లో ముంబయి కార్మికులు.. షూటింగ్‌లో ఉద్రిక్తత

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ (Ustad Bhagat Singh) సినిమా షూటింగ్ (Shooting) వేగంగా కొనసాగుతోంది.


అయితే ఆదివారం తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ బంద్ (Telugu Film Federation bandh) కు పిలుపునిచ్చిన నేపథ్యంలో..చిత్ర యూనిట్ ముంబైకి చెందిన కార్మికులతో షూటింగ్ కొనసాగించే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులు (Telugu Film Federation workers) పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని.. షూటింగ్ నిలిపివేయాలని నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ముంబై కార్మికులతో షూటింగ్ జరుపుతున్న పవన్ కళ్యాణ్, మైత్రి సంస్థ పై తెలుగు సినీ కార్మికులు తీవ్ర ఆగ్రహం (Indignation) వ్యక్తం చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే తాజా షూటింగ్ సమయంలో హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్పాట్ లో ఉన్నాడా లేడా అనే విషయంపై ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. కాగా ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ (Film chamber)లో ప్రొడ్యూసర్లు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని.. ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్లపై చర్చిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.