దాదాపుగా 20 ఏళ్ళ నుండి బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన ‘ఢీ'(Dhee Show) షో, ప్రస్తుతం 20 వ సీజన్ ని జరుపుకుంటుంది.
గత సీజన్ కి టీఆర్ఫీ రేటింగ్స్ పెద్దగా రాలేదు. అందుకే ఈ సీజన్ అదిరిపోవాలనే ఉద్దేశ్యంతో పాత సీజన్స్ కి సంబంధించిన బెస్ట్ డ్యాన్సర్స్ అందరినీ ఈ సీజన్ లోకి తీసుకొచ్చారు. వీళ్ళ మధ్య పోటీ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు,ఎవరికీ వారు తమ స్టైల్ లో దుమ్ము లేపేస్తున్నారు. ప్రారంభం ఎపిసోడ్స్ నే ఈ రేంజ్ లో ఉన్నాయంటే ఇక భవిష్యత్తులో రాబోయే ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. గత ఎపిసోడ్ లో పండు వేసిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. ఇక ఈ వారం ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్స్ కూడా మంచి ఫైర్ మీద ఉన్నాయని ప్రోమో ని చూస్తేనే అర్థం అవుతుంది.
ఈ ప్రోమో లో ఒక ముసలి తాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పాటకు కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో డ్యాన్స్ వేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. అవేమి స్టెప్పులు, అదేమీ స్పీడ్, అదేమీ గ్రేస్ బాబోయ్, కుర్రోళ్ళు కూడా ఈ రేంజ్ లో డ్యాన్స్ వెయ్యలేరు కదా?, చిరంజీవి గ్రేస్ ని మ్యాచ్ చేయడం అంత తేలికైన విషయం కాదు, అంత సాహసం కూడా ఎవ్వరూ చెయ్యరు, కానీ ఈ తాత చిరంజీవి గ్రేస్ ని మ్యాచ్ చేయడమే కాదు, ఒకానొక సందర్భం లో ఆయన్ని దాటేశాడు కూడా. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ తాత గురించే చర్చ. అసలు ఎక్కడి నుండి వచ్చాడు రా బాబు ఈయన, ఇలాంటి టాలెంటెడ్ వ్యక్తులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎంత మంది ఉన్నారో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
































