వరలక్ష్మీ వ్రతం : బెల్లం-అన్నం… పులగం ప్రసాదాలు సింపుల్ గా

శ్రావణమాసం కొనసాగుతుంది. ఈ నెల 23 న పోలాల అమావాస్యతో ముగుస్తుంది. ఈ ఏడాది శ్రావణమాసంలో ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నారు. ఆ రోజు సింపుల్​ గా అమ్మవారికి ఏఏ నైవేద్యాలు పెట్టాలి..


వాటిని ఎలా తయారు చేయాలి.. ఏఏ పదార్దాలు కావాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .

ఏ పూజ చేసినా .. ఏ నోము నోచినా.. ప్రసాదాలు కంపల్సరీ… అవి టేస్టీగా.. త్వరగా తయారు చేసే విధంగా ఉండాలి. ఈ నెల 8న వరలక్ష్మి వత్రం ఉంది. ఆరోజు మహిళలు అమ్మవారిని పూజిస్తారు. చంటి పిల్లల తల్లులు.. కొత్తగా పెళ్లయిన వారు.. ఉద్యోగస్తులు సింపుల్​గా నైవేద్యాలు చేసుకుంటారు. పెద్ద ప్రోసస్​ లేకుండా.. చిటికెలో వంవడుకొనే ప్రసాదాలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి హాట్​… మరొకటి స్వీట్​.. అమ్మవారికి వీటిని నివేదించి భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తే ఆ జగన్మాత మీకోరికలను తీరుస్తుందని పండితులు చెబుతున్నారు.

బెల్లం అన్నం తయారీకి కావలసిన పదార్ధాలు

  • బియ్యం – ఒక కప్పు
  • పెసరపప్పు – అరకప్పు
  • నెయ్యి – మూడు స్పూనులు
  • బెల్లం – అరకప్పు
  • పాలు – ఒక కప్పు
  • జీడిపప్పులు – ఆరు
  • కిస్ మిస్​ – పది
  • యాలకుల పొడి – అరస్పూన్​

తయారీ విధానం:ముందుగానే బియ్యాన్ని, పెసరపప్పును అరగంట నానబెట్టాలి. స్టవ్​ వెలిగించి ఈ రెండింటిని కుక్కర్​ లో మెత్తగా ఉడకబెట్టాలి. తరువాత కుక్కర్​ మూత తీసి పెద్ద గరిటతో బాగా కలపాలి. సన్నటి మంటపై బియ్యం .. పెసరపపప్పు మిశ్రమం ఉంచి అందులో తురిమిన బెల్లం యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మరోపక్క పాలను వేడి చేసుకోవాలి. మిశ్రమంలో బెల్లం కరిగిన తరువాత కాచిన పాలను పోసి.. దగ్గరగా అయ్యేదాకా ఉడికించాలి. నెయ్యిలో కిస్​ మిస్​.. జీడిపప్పు వేయించి కలుపుకోవాలి. స్టవ్​ పై నుంచి దించే ముందు రెండు స్పూనుల నెయ్యి వేసుకోవాలి. అంతే బెల్లం-అన్నం ప్రసాదం రడీ..

పులగం తయారీకి కావాల్సిన పదార్థాలు

  • బియ్యం – ఒక కప్పు
  • పెసరపప్పు – అర కప్పు
  • మిరియాల పొడి – అర స్పూను
  • జీలకర్ర – అర స్పూను
  • కరివేపాకులు – సరిపడ
  • జీడిప్పులు – ఆరు
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం: బియ్యం, పెసరపప్పును అరగంట ముందే నానబెట్టాలి. స్టవ్​ పై కళాయి పెట్టి నెయ్యిలో జీడిపప్పును వేయించి ఒక బౌల్​ లో పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో మరికొద్దిగా నెయ్యి తీసుకుని అందులో జిలకర్ర, మిరియాలు, కరివేపాకులు వేగించాలి. అందులో మూడుగ్లాసులు నీళ్లుపోసి.. సరిపడ ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందు నానబెట్టుకున్న బియ్యం.. పెసరపప్పు వేయాలి. మెత్తగా ఉడికిన తరువాత స్టవ్​ ఆపేసి పైన జీడిపప్పులు చల్లాలి. ఇక అమ్మవారికి సూపన్​ టేస్టీ పులగం రడీ..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.