వొడా కొత్త ప్లాన్‌.. ఆరు నెలలకు రూ.549 మాత్రమే

 ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) తమ కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను (prepaid plan) తీసుకొచ్చింది.


కేవలం రూ.549కే 180 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంటే ఒకసారి రీఛార్జ్‌ చేస్తే దాదాపు ఆరు నెలల పాటు వినియోగించుకోవచ్చు. డేటాతో పనిలేకుండా కేవలం పరిమిత కాల్స్‌ మాత్రమే కావాలనుకొనేవారికి ఈ ప్లాన్‌ ఉపయోగపడనుంది.

ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు అందిస్తున్న రీఛార్జ్‌ ప్లానుల్లో డేటాతో పాటు కాల్స్‌ను అందిస్తున్నాయి. అందుకు భిన్నంగా వొడాఫోన్‌ ఐడియా ఈ కొత్త ప్లాన్‌ను డిజైన్‌ చేసింది. రూ.549తో రీఛార్జి చేసుకుంటే రూ.549 టాక్‌టైమ్‌ లభిస్తుంది. లోకల్‌/ ఎస్టీడీ కాల్స్‌కు నిమిషానికి 2.5 పైసా చొప్పున ఛార్జ్‌ చేస్తారు. కేవలం 1జీబీ డేటా లభిస్తుంది. ఒకవేళ ఆ డేటా అయిపోతే డేటా వోచర్లతో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అపరిమిత కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ సదుపాయం లేదు. సెకండరీ సిమ్‌గా వొడాఫోన్‌ ఐడియా వాడేవారికి ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. సెకండ్‌ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు ఇప్పుడు ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి రావడంతో చాలా మంది రెండో సిమ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా ఈ లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.