ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తోంది. తాజాగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి భారీగా కోత వేస్తారని చర్చ జరుగుతోంది.
ఉద్యోగుల వేతనంతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్‌లో కోత విధిస్తారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) కింద చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సమగ్ర వైద్య సంరక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం మోడల్ హెల్త్ కేర్ సదుపాయాలు దేశంలోని 80 నగరాల్లో సుమారు 42 లక్షల మంది లబ్ధిదారులకు లభిస్తున్నాయి.
7వ వేతన సంఘం కింద సీజీహెచ్‌ఎస్ సహకారం ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఉంటుంది. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి ఎంత డబ్బు కోత వేస్తారో తెలుసా? 7వ వేతన సంఘం కింద ప్రతి నెలా ఉద్యోగి వేతనం నుంచి ఎంత డబ్బు కట్ చేస్తారో కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. 1 జనవరి 2017 నుంచి అమలులోకి వచ్చేలా.. 7వ వేతన సంఘం పే మ్యాట్రిక్స్‌లోని వారి జీతం ఆధారంగా ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి ఇలా కోతలు విధిస్తున్నారు.
7వ వేతన సంఘం ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో పలు స్థాయిలు ఉన్నాయి. ఆ స్థాయిల ప్రకారం జీతం, పింఛన్‌లో ఇలా కోతలు ఉంటాయి.
లెవెల్ 1-5: రూ.250
లెవెల్ 6: రూ.450
లెవెల్ 7-11: రూ.650
లెవెల్ 12.. అంతకంటే ఎక్కువ లెవల్: రూ.1000
పొందడం ఇలా..
సీజీహెచ్‌ఎస్ అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ వైద్యం, యోగ వైద్య విధానాల ద్వారా ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఆరోగ్య సంరక్షణ అందిస్తోంది. సీజీహెచ్‌ఎస్ సౌకర్యాలను పొందాలనుకునే పెన్షనర్లు సీజీహెచ్‌ఎస్ కార్డుల జీవితకాల చెల్లుబాటు కోసం వార్షిక ప్రాతిపదికన లేదా ఒకసారి (పది సంవత్సరాలు) చెల్లింపు చేయవచ్చు. ఢిల్లీలో ఉంటే పీఏఓ సీజీహెచ్‌ఎస్ ఢిల్లీ, లేదా సీజీహెచ్‌ఎస్ నగర అదనపు డైరెక్టర్ పేరుతో భారత్ కోష్ ద్వారా చెల్లింపులు చేయాలి. పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లు చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ వారి పదవీ విరమణ సమయంలో లేదా ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సమయంలో వారు చందా చేసుకున్న మొత్తం అవుతుంది. కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తేదీన వర్తించే కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని చెల్లించాలి.
సీజీహెచ్‌ఎస్ ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో సీజీహెచ్‌ఎస్ కార్డుపై ఆమోదించిన ఆసుపత్రి వార్డు అర్హత వివరాలు ఇలా ఉన్నాయి. సీజీహెచ్‌ఎస్ కింద ఎంప్యానెల్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలోని ఆసుపత్రి వార్డుల అర్హతలు ఈ కింది విధంగా ఉన్నాయి.
వార్డు అర్హత: జనరల్ వార్డు
7వ వేతన సంఘంలో నెలకు అధికారి తీసుకునే మూల వేతనం: రూ.36,500 వరకు
వార్డు అర్హత: సెమీ ప్రైవేట్ వార్డు
7వ వేతన సంఘంలోలో అధికారి నెలకు తీసుకునే మూల వేతనం: రూ.36,501 నుంచి 50,500 వరకు ఉంటుంది.
వార్డు హక్కు: ప్రైవేట్ వార్డు
7వ వేతన సంఘంలో అధికారి నెలకు తీసుకునే మూల వేతనం: రూ.50,501 అంతకంటే ఎక్కువ.
































