ఆధార్‌ అప్‌డేట్‌ ఉంటేనే ఉచిత ప్రయాణం

  • మహాలక్ష్మి పథకం అమలు కావాలంటే తప్పనిసరి

మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద.. ఇకపై ఉచితంగా బస్సు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసి ఉండాలని అధికారులు తెలిపారు.


‘జీరో టిక్కెట్‌’ జారీ చేసే సమయంలో ఆధార్‌ కార్డులో అప్‌డేట్‌ చేసిన ఫొటోతో పాటు తెలంగాణ చిరునామా ఉండాలని చెప్పారు. ఇటీవల పథకాన్ని అమలు చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ముఖ్యంగా నివాస ధృవీకరణ విషయంలో అవాంతరాలు తలెత్తుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.