భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) అంటే వినియోగదారుల్లో ఓ నమ్మకం కనిపిస్తుంది. సంవత్సరాలుగా ప్రజల మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్న ఈ బ్రాండ్, ప్రత్యేకించి మారుతి స్విఫ్ట్ (Swift) వంటి మోడళ్లతో మరింతగా ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది.
ప్రతి నెలా కార్ల సేల్స్ జాబితాల్లో మారుతి స్విఫ్ట్ పేరు మెరుగైన గణంకాలతో కనిపించటం సాధారణమే. శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, అత్యుత్తమ మైలేజీ, చక్కని డిజైన్, సురక్షితమైన ఫీచర్లు ఇవన్నీ కలగలిపి అద్భుతమైన కారుగా ఇది అందరి చేత ఆదరణను పొందుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని మరింతగా గెలుచుకుంటూ, మారుతి సుజుకి సంస్థ మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. తాజాగా విడుదలైన గణంకాలను చూసినట్లయితే ఈ కారు డిమాండ్ ఏ మేరకు ఉందో తెలుస్తుంది.
తన స్టైలిష్ డిజైన్, మంచి మైలేజీ, ఫ్యామిలీకి అనువైన ఫీచర్లతో మారుతి స్విఫ్ట్ జూలైలో ఏకంగా 14,200 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి ఐదోవ స్థానాన్ని సంపాదించింది. ఇది నగరాల్లోనే కాకుండా పల్లెటూర్లలోనూ మంచి ఆదరణ పొందుతున్నదని స్పష్టమవుతోంది. ఇందులో మారుతి డిజైర్ ప్రత్యేకంగా నిలిచింది. జూలైలో ఏకంగా 20,895 యూనిట్ల విక్రయాలను నమోదు చేస్తూ మొదటి స్థానాన్ని సంపాదించింది. మారుతి సుజుకి స్విఫ్ట్ మధ్యతరగతి కలల కారు.
మారుతి సుజుకి స్విఫ్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇది కేవలం స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ మాత్రమే కాకుండా, సౌకర్యం, వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మోడల్. ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం, ఈ కారులో బేస్ వేరియంట్ ధర రూ.6.49 లక్షల నుండి ప్రారంభమవుతూ, టాప్ వేరియంట్ ధర రూ.9.64 లక్షల వరకు ఉంటుంది. ఐదు మందికి సౌకర్యవంతంగా కూర్చునేలా ఏర్పాటు చేయబడిన సీటింగ్‌తో వచ్చింది.
మారుతి సుజుకి స్విఫ్ట్ పరంగా కూడా తన స్థానాన్ని ప్రూవ్ చేసుకున్న కారుగా నిలుస్తోంది. తాజా మోడల్‌కి 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, CNG వేరియంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, అలాగే సౌకర్యం కోరుకునే వారు ఎంచుకునేలా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా లభిస్తుంది. ఇది నగర రద్దీ, హైవే ప్రయాణాల్లో ఫ్రీ డ్రైవింగ్‌ను కల్పించడంలో సహాయపడుతుంది.
మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.80 కిమీ వరకు మైలేజీ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఇదే సమయంలో, CNG వేరియంట్ మరింత ఆర్థికంగా ఉండి, లీటరుకు 32.85 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు. ఈ గణాంకాలు చూస్తే, పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇది ఖచ్చితంగా సేవింగ్స్ కోరుకునే వినియోగదారులకు అనువైన ఆప్షన్. ఈ విధంగా, మైలేజీ, ఇంజిన్ ఆప్షన్లు, ట్రాన్స్మిషన్ ఎంపికలతో స్విఫ్ట్ అందరికీ అందుబాటులో ఉంది.
చిన్న కుటుంబం ఉంటే, స్టైలిష్ డిజైన్‌తో పాటు ఫన్-టు-డ్రైవ్ అనుభూతిని కోరుకునే హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నట్లయితే, మారుతి స్విఫ్ట్ ఖచ్చితంగా మీకు సరైన ఎంపిక. సిటీ డ్రైవ్‌లు అయినా, వీకెండ్ లాంగ్ రైడ్‌లు అయినా స్విఫ్ట్ అందించేది ఒక స్మూత్, కంఫర్టబుల్ రైడింగ్ అనుభవం ఇస్తుంది. ఇప్పటి తరం వెర్షన్‌లో మారుతి కంపెనీ, రైడ్ క్వాలిటీ విషయంలో మరింత మెరుగులు దిద్దడంతో, ఇది మునుపటికంటే ఇంకా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది.
































