తెల్ల జుట్టు వస్తోందా.. ఈ 6 ఇంటి చిట్కాలు ఫాలో అయితే హెయిర్ నల్లగా మారిపోతుందట

రోజూ ఉసిరి నూనెను వాడటం వల్ల జుట్టు నెరసిపోకుండా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి సహజంగా నల్లగా చేస్తాయి.


ఉల్లిపాయ రసం జుట్టుకు బలాన్ని చేకూరుస్తుంది. రంగును పునరుద్ధరిస్తుంది. ఉల్లిపాయలలోని ఎంజైమ్ కాటలేజ్ తెల్ల జుట్టుకు కారణమైన హైడ్రోజన్ పెరాక్స్​డ్​ను విచ్ఛిన్నం చేస్తుంది. వారానికి 2 సార్లు ఉల్లిపాయ రసాన్ని తలపై పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలి.

అమ్మమ్మల నాటి చిట్కా కరివేపాకులో కొబ్బరి నూనెను వేసుకుని పెట్టుకోవడమే. కరివేపాకులో మెలానిన్ ఉత్పత్తిని పెంచే శక్తి ఉంది. ఇది జుట్టుకు సహజమైన రంగును అందిస్తుంది. కరివేపాకును కొబ్బరి నూనెలో మరిగించి చల్లార్చి తలకి అప్లై చేసుకోవాలి.

మెరిసే, బలమైన జుట్టు కోసం మెంతి-పెరుగు బెస్ట్ ఆప్షన్. మెంతులు జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తుంది. పెరుగు తేమను అందిస్తుంది. రెండింటినీ కలిపి హెయిర్ ప్యాక్ చేసుకుని వారానికి ఒకసారి వేసుకుంటే మంచిది.

బ్లాక్​ టీలో టానిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జుట్టుకు నల్ల రంగును ఇస్తుంది. 2 టీస్పూన్ల టీపొడిని మరిగించి.. చల్లార్చి 1 గంట తర్వాత కడిగేయండి. క్రమం తప్పకుండా వాడటం వల్ల మార్పు కనిపిస్తుంది.

భృంగరాజ్​ను ‘జుట్టుకు రాజు’ అని పిలుస్తారు. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల తెల్ల జుట్టు తగ్గడమే కాకుండా.. కొత్త జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. కొద్దిగా గోరువెచ్చగా చేసి తలపై మసాజ్ చేయండి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.