ఇంస్టాగ్రామ్ యాప్ లో కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలంటే?

సోషల్ మీడియాలో టాప్ వన్ ప్లేస్ లో ఉన్న యాప్ లలో ఇంస్టాగ్రామ్ యాప్ ఒకటి. ఎంటర్టైన్మెంట్ తో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా చేయడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు తమ టాలెంటును చూపించుకోవడానికి కూడా ఈ యాప్ సహాయపడుతుంది. అయితే మెటా సంస్థకు చెందిన ఈ యాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫీచర్లలో అందుబాటులోకి తీసుకొచ్చి అలరిస్తోంది వీటిలో కొన్ని ఫీచర్లు ప్రస్తుతం అమల్లో ఉండగా.. మరో ఫ్యూచర్ మాత్రం ఇతర దేశాల్లో కొనసాగుతోంది. ఇంతకీ ఆ ఫీచర్లు ఏవి? అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.


టిక్ టాక్ యాప్ బ్యాన్ అయిన తర్వాత ఇంస్టాగ్రామ్ యాప్ అభివృద్ధి చెందింది. ఫోటోలు, వీడియోలు అప్డేట్ చేయడానికి.. ఎంటర్టైన్మెంట్ పొందడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఒక్కోసారి మనం అనుకున్న వీడియోలను అప్లోడ్ చేయలేక పోతుంటాం. కానీ మనం అనుకున్న వీడియోను మన ఫ్రెండ్ లేదా ఇతరులు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోను మన ఫాలోవర్స్ చూసి.. మనకు ఇంప్రెస్ రావడానికి కొత్తగా ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనినే రీ పోస్ట్ అని అంటారు. అంటే ఒకరు ఏర్పాటు చేసుకున్న వీడియోను దానిని రిపోర్టు చేయడం వల్ల మన ఫాలోవర్స్ ఆ వీడియోలను చూస్తూ ఉంటారు. అంతేకాకుండా లైక్స్ కూడా వస్తే అవి మనకే చెందుతాయి. అయితే అధికారికంగా మాత్రం వర్జినల్ యూజర్ కి వెళుతుంది.

ఈ యాప్ లో మరో ఫీచర్ ఇంప్రెస్ చేస్తుంది. ఇందులో ఒక ఐకాన్ పై క్లిక్ చేయగానే.. స్క్రీన్ పైన ఫ్రెండ్ టాప్ కనిపిస్తుంది. దానిని ట్యాప్ చేస్తే చాలు ఆ ఫ్రెండ్ చూసిన రీల్స్, రియాక్ట్ అయిన తీరు తెలుస్తుంది. అయితే మన రీల్ కు సంబంధించిన లైక్స్, కామెంట్లు ఎవరికి కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. రీల్స్ పై ఇతరులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారనేది కూడా ఎవరికి కనిపించకుండా చేసుకోవచ్చు.

ఇందులో ఆకర్షించే మరో ఫీచర్ మ్యాప్. ఈ ఫీచర్ ద్వారా ఎవరైతే లైక్స్ కొట్టారో.. ఎవరైతే ఫాలో అవుతున్నారో.. ఎవరైతే రీల్ను అప్డేట్ చేస్తున్నారో వారికి సంబంధించిన లొకేషన్ ను తెలుసుకోవచ్చు. సాధారణంగా లోకేషన్ ఆప్షన్ డి పాటులో ఆఫ్ అయి ఉంటుంది. అవసరమనుకుంటే దానిని ఆన్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫీచర్ మన భారత్లో అందుబాటులో లేదు. ఇతర దేశాల్లో కొనసాగుతోంది.

ఇలా ఈ ఫీచర్ ఇంస్టాగ్రామ్ వాడేవారికి ఉపయోగకరంగా ఉండబోతుంది. అయితే ఇంస్టాగ్రామ్ యాప్ అప్డేట్ అయిన తర్వాత ఇవి కనిపిస్తాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ మధ్య కమ్యూనికేషన్ మరింతగా పెంచుకునేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు యాజమాన్యం తెలుపుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.