బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఇది పెట్టుబడిదారులకు ఊరట కలిగించినా..
కొత్తగా బంగారు కొనుగోలుదారులకు మాత్రం మరింత భారం పడనుంది. రాబోయే రోజుల్లో బంగారం ధర 38 శాతం తగ్గుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సప్లై పెరిగి, డిమాండ్ తగ్గడం వల్ల మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ, ప్రధాన ఆర్థిక సంస్థలు రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలను అంచనా వేస్తూ ఆశాజనకంగా ఉన్నాయి.
బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. ఇది పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చింది కానీ వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది. అయితే.. అమెరికాకు చెందిన ఒక విశ్లేషకుడు బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేశారు. అంతే కాకుండా.. అమెరికాకు చెందిన మార్నింగ్‌స్టార్ విశ్లేషకుడు రాబోయే కొన్ని సంవత్సరాలలో బంగారం రేటు 38 శాతం క్షీణతను అంచనా వేశారు.
భారత మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు లక్ష రూపాయల మార్కును దాటింది. ఆ సమయంలో దాదాపు 40% తగ్గుదల భారతదేశంలో 10 గ్రాముల ధర దాదాపు రూ. 55,000 వరకు ఉంటుందని ఆయన అంచనా వేశారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌స్టార్ వ్యూహకర్త జాన్ మిల్స్ మాట్లాడుతూ బంగారం ధరలు ఔన్సుకు 3,080 డాలర్లు నుండి 1,820 డాలర్ల వరకు తగ్గుతాయని అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది.
ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ఇటీవలి ర్యాలీకి ఆజ్యం పోసింది. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ప్రారంభమైన వాణిజ్య వివాదాల మధ్య బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
































