సంచలనం.. ‘మెదడు’ లాగా పని చేసే కంప్యూటర్‌.! ఎక్కడంటే

సాంకేతిక ప్రపంచంలో మరో ముందడుగు వేసిన చైనా. మానవ మెదడులా పనిచేసే కంప్యూటర్‌ను అభివృద్ధి చేసిన జెజియాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.  చైనా కనిపెట్టిన ఈ కంప్యూటర్‌ ప్రత్యేకతలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరి దీని సంగతి ఏంటి.? ఇది ఎలా పని చేస్తుంది.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.

దీని నిర్మాణం, పనితీరు మానవ మెదడును పోలి ఉంటుంది. దీనిలో 20 బిలియన్లకు పైగా కృత్రిమ న్యూరాన్‌ల వినియోగం. డార్విన్ మంకీ అనేది జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని డెవలపర్లు అభివృద్ధి చేసిన న్యూరోమార్ఫిక్ కంప్యూటర్.


మానవ మెదడు లాగా ఆలోచించడం, అర్థం చేసుకోవడం, నిర్ణయం తీసుకోవడం వంటి పనులను చేయగల కంప్యూటర్‌. ఈ కంప్యూటర్ 960 ‘డార్విన్-3’ చిప్‌లపై ఆధారపడి,100 బిలియన్లకు పైగా సినాప్సెస్ ఏర్పడతాయి. సినాప్సెస్ అనేవి న్యూరాన్‌లను అనుసంధానించే భాగాలు, సమాచారాన్ని చాలా వేగంగా ప్రాసెస్ చేయగల వ్యవస్థ.

దీని సహాయంతో AI వ్యవస్థలను మరింత తెలివిగా తయారు చేయవచ్చంటున్నా శాస్త్రవేత్తలు. ఈ వ్యవస్థ మకాక్ కోతులు, ఎలుకలు, జీబ్రాఫిష్ వంటి జంతువుల మెదడులతో నిర్మాణం. ఇది నాడీశాస్త్రం మరియు వైద్య పరిశోధనలకు కొత్త దిశను ఇవ్వగలదంటున్న శాస్త్రవేత్తలు.

డార్విన్ మంకీలో ‘స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్’ టెక్నాలజీని ఉపయోగం. ఇది మానవ మెదడు జీవసంబంధమైన న్యూరాన్‌ల వలె పనిచేస్తుంది. కంప్యూటర్‌కు నేర్చుకునే, గుర్తుంచుకోవడానికి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ కంప్యూటర్ రోబోటిక్స్, డేటా ప్రాసెసింగ్, మెదడు పరిశోధన, వైద్య పరిశోధన, ఔషధ అభివృద్ధిలో ఉపయోగించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.