తారక్ వన్ టేక్ ఫైనల్ టేక్ ఆర్టిస్ట్… హృతిక్ రోషన్ మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా

తారక్ (ఎన్టీఆర్), తాను కో స్టార్స్ కింద ‘వార్ 2’ ప్రయాణం ప్రారంభించామని… షూట్ కంప్లీట్ అయ్యేసరికి నిజ జీవితంలో తామిద్దరం బ్రదర్స్ అయ్యామని హృతిక్ రోషన్ (Hrithik Roshan) తెలిపారు.


‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (War 2 Pre Release Event)లో కొంచెం సేపు ఆయన తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అభిమానులు అందరికీ ఎన్టీఆర్ అన్నయ్య అయితే తనకు తమ్ముడు అని హృతిక్ చెప్పారు.

ఎన్టీఆర్ మీద ఎప్పటికీ ఇలాగే ప్రేమ చూపించాలి!
తన సోదరుడు ఎన్టీఆర్ మీద అభిమానులు అందరూ ఎప్పటికీ ఇదే విధమైన ప్రేమ చూపిస్తామని తనకు ప్రామిస్ చేయాలని హృతిక్ రోషన్ కోరారు. ప్రేక్షకులు ప్రేమకు తారక్ అర్హుడని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు, హీరోగా తన 25 ఏళ్ళ ప్రయాణంలో చేసిన సినిమాలు అన్నిటి కంటే ‘వార్ 2’ పైన ఉంటుందని హృతిక్ తెలిపారు. ‘వార్’లో పోషించిన కబీర్ పాత్రను తాను ఎంతో ఎంజాయ్ చేశారని, ఇప్పుడీ సినిమాలో మరోసారి ఆ రోల్ చేయడం సంతోషంగా ఉందనన్నారు.

ఎన్టీఆర్ చూశాక కంప్లైంట్ చేయాలని అనిపించలేదు!
యాక్షన్ సినిమా అంటే హీరోలకు ఇంజ్యూరీలు కావడం కామన్. తమకు ఎంత ఇబ్బంది అయినా సరే అభిమానుల కోసం భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తారు. కష్టపడతారు. అయితే ఎన్టీఆర్ డెడికేషన్, హార్డ్ వర్క్ చూశాక తనకు కంప్లైంట్ చేయాలని అనిపించలేదని హృతిక్ రోషన్ తెలిపారు. ప్రేక్షకుల ప్రేమ కోసం మరింత కష్టపడతానని వివరించారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఒక విజన్ తో సినిమా తీశారని చెప్పారు.

తారక్ (NTR)లో తనను తాను చూసుకున్నానని హృతిక్ రోషన్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”మా ఇద్దరి ప్రయాణం సిమిలర్ గా ఉంటుంది. మేం ఈ ఇండస్ట్రీలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఎన్టీఆర్ వన్ టేక్, ఫైనల్ టెక్ స్టార్. అతడిని అబ్జర్వ్ మాత్రమే చేయలేదు. ఎన్టీఆర్ నుంచి నేను చాలా నేర్చుకున్నా. 99.99 శాతం కాదు… 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి షాట్ చేస్తాడు. షాట్ ఎలా వచ్చిందో కూడా చెక్ చేయడు” అని చెప్పారు. తారక్ మంచి షెఫ్ కూడా! ఎప్పటికీ అతని చేతి వంట, బిర్యానీ టేస్ట్ చేస్తానని చెప్పారు హృతిక్ రోషన్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.