Toll Discounts: హ్యాపీ టోల్‌గేట్‌

  • పంద్రాగస్టు నుంచే అమల్లోకి ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌.. ఒకసారి రూ.3వేలు కడితే చాలు
  • ఏడాదిపాటు దేశవ్యాప్తంగా 200సార్లు టోల్‌ మీదుగా వెళ్లొచ్చు
  • వీఆర్‌ఎన్‌తో రిజిస్టర్‌ అయిన ఫాస్టాగ్‌లకే పాస్‌ వర్తింపు
  • చాసిస్‌ నంబరుతో రిజిస్టర్‌ చేసిన ఫాస్టాగ్‌లకు నో
  • టోల్‌చార్జీల మోతతో తల బొప్పి కట్టినవారికి గొప్ప ఊరట! ఉద్యోగ, వ్యాపారాల కోసం వరుస ప్రయాణాలు చేసే వారికి టోల్‌ భారం గణనీయంగా తగ్గనుంది. మునుపటి మాదిరిగా నెలకు టోల్‌చార్జీల రూపంలో వేలకు వేలు వదిలించుకోవాల్సిన పనిలేదు. ఈ మేరకు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీపికబురు తెచ్చింది. ఒకసారి రూ.3వేలు కడితే చాలు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్ల మీదుగా గరిష్ఠంగా 200సార్లు ప్రయాణించే అవకాశం!! ‘వార్షిక పాస్‌’ అనే పేరుతో ఈ పథకాన్ని ఫాస్టాగ్‌ యూజర్ల కోసం ఈనెల 15 నుంచి అమల్లోకి తేనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌గేట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పాస్‌ను ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ అనే మొబైల్‌ యాప్‌, లేదా జాతీయ రహదారుల అథారిటీ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికార వెబ్‌సైట్‌ నుంచి పొందొచ్చు. దరఖా స్తు చేసుకునేవారి వాహనాల రిజిస్ట్రేషన్‌ వివరాలు ‘వాహన్‌ డేటాబే్‌స’లో అప్‌డేట్‌ అయి ఉండాలి. ఆ తర్వాత వాహనానికి అనుసంధానం చేసిన ఫాస్టాగ్‌ వివరాలు, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా మొబైల్‌ యాప్‌ లేదా వైబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. డబ్బులు చెల్లించిన తర్వాత రెండు గంటల్లోగా వార్షిక పాస్‌ యాక్టివేట్‌ అవుతుంది. అయితే ఈ పాస్‌ ప్రైవేటు వాహనాలకే వర్తిస్తుంది. వాణిజ్య(క మర్షియల్‌) వాహనాలు, ట్యాక్సీలకు వర్తించదు. అలాగే.. ఒక వాహనానికి జారీ చేసిన పాస్‌ను మరొక వాహనానికి బదిలీ చేయడం కూడా వీలుకాదు. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు (వీఆర్‌ఎన్‌)తో రిజిస్టర్‌ చేసిన ఫాస్టాగ్‌పై మాత్రమే ఈ పాస్‌ వర్తిస్తుంది. చాసిస్‌ నంబరుతో రిజిస్టర్‌ చేసిన ఫాస్టాగ్‌లకు వర్తించదు. ఈ పాస్‌లు దేశంలోని జాతీయ రహదారులు (ఎన్‌హెచ్‌), జాతీయ ఎక్స్‌ప్రె్‌స వే (ఎన్‌ఈ)లపై మాత్రమే పనిచేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే రాష్ట్ర రహదారులు (ఎస్‌హెచ్‌), ఇతర లోక ల్‌, ప్రైవేట్‌ టోల్‌ ప్లాజాల వద్ద మాత్రం సాధారణ ఫాస్ట్‌గ్‌ మాదిరిగానే టోల్‌ చార్జీలు వసూలు చేస్తారు.

    వార్షిక పాస్‌ తీసుకున్న వాహనదారులకు టోల్‌గేట్‌ దాటి న ప్రతిసారి ఒక ట్రిప్‌గా పరిగణిస్తారు. క్లోజ్డ్‌ టోల్‌ గేట్‌ వద్ద మా త్రం ఎంట్రీ-ఎగ్జిట్‌ కలిపి ఒకే ట్రిప్‌ గా లెక్కిస్తారు. అయితే ఈ వార్షిక పాస్‌ కోసం మళ్లీ కొత్తగా ఫాస్టాగ్‌ రిజిస్టర్‌ చేసుకోవాల్సిన పనిలేదు. ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌ పైనే యాక్టివేట్‌ చేసుకోవొచ్చు. ఇప్పటికే ఫాస్టాగ్‌ వాలెట్‌లో బ్యాలెన్‌ ఉంటే దాన్ని ఉపయోగించి ఈ పాస్‌ను కొనుగోలు చేయలేరు. ”ప్రజల ప్రయాణ ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొస్తున్నాం. ఫాస్టాగ్‌ వినియోగంలో మరింత పారదర్శకత, వేగవంతమైన ప్రయాణాలకు ఇది దోహదం చేస్తుంది” అని కేంద్ర రవాణ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వార్షిక పాస్‌పై యూజర్లకు ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్టులు, ట్రిప్‌ సమాచారాన్ని పంపిస్తారని వెల్లడించారు. అయితే ఈ పాస్‌ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. ఈ వార్షిక పాస్‌ను వద్దు అనుకునేవారు ప్రస్తుతం చెలామణిలో ఉన్న టారి్‌ఫల ప్రకారమే ఫాస్టాగ్‌ ఉపయోగించుకోవొచ్చు.

    ఎక్కువగా తిరిగే వారికి మేలు

    వార్షిక పాస్‌ పథకం అనేది ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి ఎంతో ప్రయోజనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన మధుకర్‌ తన ఆఫీసు అవసరాల దృష్ట్యా నెలలో కనీసం 2 సార్లు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కారులో వెళ్లొస్తారు. వెళ్లేటప్పుడు 4టోల్‌గేట్లలో కలిపి దాదాపు 400ఖర్చవుతుంది. మర్నాడు (24 గంటల తర్వాత) తిరుగు ప్రయాణంలో మరో 400 కట్టాలి. అంటే ఒక ట్రిప్‌కే రూ.800. అంటే.. నెలకు 4 టోల్‌గేట్ల మీదుగా 16 ట్రిప్పుల చొప్పున ఏడాదికి 192 ట్రిప్పులు అవుతాయి. ఇందుకు మదుకర్‌ రూ.19,200 కడుతున్నారు. ఒకవేళ 3వేలు కట్టి వార్షిక పాస్‌ను తీసుకుంటే రూ.16,200 మిగులుతాయి. ఈ పాస్‌ గురించి తెలిసి మధుకుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.