PAN కార్డు రెన్యువల్‌ చేసుకోవాలా.. అయితే ఇదే సులభమైన మార్గం

ప్రజెంట్‌ డేస్‌లో దాదాపు ప్రతి ఆర్థిక లావాదేవీలోనూ పాన్ కార్డ్ తప్పనిసరి అయింది. బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయడం నుంచి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం లేదా ఏదైనా పెద్ద పెట్టుబడి ప్రక్రియ అయినా, కచ్చితంగా పాన్‌ కార్డు అవసరం పడుతుంది.


అయితే కొన్ని సార్లు మన దగ్గర ఉన్న కార్డు విరిగిపోవడమో, పాడైపోవడమో కావచ్చు. అలాంటప్పుడు మనకు కొత్త కార్డు కావాలన్నా, లేదా మనం మన వ్యక్తిగత సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలన్నా.. ఇదు వరకు సర్వీస్‌ సెంటర్‌లకు వెళ్లవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఆలా బయటకు వెళ్లాల్సి అవసం లేదు.. మన ఇంట్లో ఉండే ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకొవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు రెండు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ల అయిన NSDL లేదా UTIITSL ద్వారా ఈజీగా పాన్ కార్డును రెన్యువల్‌ చేసుకోవచ్చు. ఈ రెండు వెబ్‌సైట్‌లలో మీరు కొత్త దరఖాస్తు, నకిలీ కార్డు, శ్యక్తిగత సమాచారం అప్‌డేట్‌, రెన్యువల్‌ సహా అన్ని సేవలను పొందవచ్చు. సరైన పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, మీరు తగిన ఫారమ్‌ను ఎంచుకోవాలి. భారతీయ పౌరులకు ఫారమ్ 49A, విదేశీ పౌరులకు ఫారమ్ 49AA నింపాలి. ఫామ్ ఫిల్‌ చేసేటప్పుడు, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఇతర వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి, ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా దరఖాస్తు నిలిపివేయడుతుంది.

సరైన ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్స్‌ మాత్రమే అప్‌లోడ్ చేయండి

పాన్ కార్డును రెన్యువల్‌ చేసుకోవడానికి, ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌ కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అందుకోసం మీరు ఆధార్ కార్డు, ఓటరు ఐడి లేదా పాస్‌పోర్ట్, విద్యుత్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులనైనా అడ్రస్‌ ప్రూఫ్‌ కింద సమర్పించవచ్చు. దాన్ని స్కాన్ చేస్తున్నప్పుడు, చిత్రం స్పష్టంగా, చదవగలిగేలా వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉన్న పత్రాలు దరఖాస్తు ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.

మీరు ఫీజులను ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించగలరు

పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. భారతదేశంలో చిరునామా ఉన్న దరఖాస్తులకు రుసుము దాదాపు ₹110. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపును సులభంగా చేయవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత, మీకు రసీదు, ట్రాకింగ్ నంబర్ వస్తుంది, దాని ద్వారా మీరు మీ దరఖాస్తు ఎక్కడి వరకు వచ్చిందనేది ఆన్‌లైన్‌లో ట్రాక్‌ చేసుకోవచ్చు.

పోస్ట్ ద్వారా నేరుగా ఇంటికే కార్డు..

మీరు దరఖాస్తులో యాడ్‌ చేసిన అన్ని వివరాలు, పత్రాలు సరైనవని నిర్ధారణ అయిన తర్వాత, కొత్త పాన్ కార్డ్ మీ అడ్రస్‌కు పోస్ట్ ద్వారా వస్తుంది. సాదారణంగా ఈ ప్రిక్రయకు వారం రోజులు పడుతుంది. పోస్టల్ ట్రాకింగ్ నంబర్ ద్వారా మీ కార్డు ఎక్కడి వరకు వచ్చిందో కూడా తెలుసుకోచ్చు. ఆఫ్‌లైన్‌ కన్నా ఆన్‌లైన్‌ ప్రక్రియ స్పీడ్‌గా జరగడమే కాకుండా పారదర్శకంగా కూడా ఉంటుంది. ఊరికే సర్వీస్‌ సెంటర్లకు వెళ్లి క్యూలో నిల్చొనే బదులు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తూ చేసుకోవడం చాలా బెస్ట్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.