బ్యాంక్ అంకౌట్స్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ : ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

బ్యాంక్ అకౌంట్స్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ పై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇటీవల ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ ను రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకునేవారికి ఈ నియమం వర్తిస్తుందని తెలిపింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదారులు రూ.50 వేలు మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిందేనని తెలిపింది. దీంతో షాకవ్వడం ఆ బ్యాంకు ఖాతాదారులు వంతైంది.

తాజాగా మినిమం బ్యాలెన్స్ పై కామెంట్ చేసిన సంజయ్ మల్హోత్రా.. అది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని తెలిపారు. మినిమం బ్యాలెన్సులపై ఆర్బీఐ నియమ, నిబంధనలు ఉండవని స్పష్టం చేశారు. కొన్ని బ్యాంకులు రూ.10 వేలు ఉంచితే, మరికొన్ని బ్యాంకులు రూ.2000 ఉంచుతాయని, మరికొన్ని బ్యాంకులైతే మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న కండీషన్నే ఎత్తివేశాయన్నారు. ఏదేమైనా ఐసీఐసీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.