హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే వెంటనే ఈ అలవాట్లను మానేయండి.

న బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే హార్ట్ అటాక్, స్ట్రోక్, హై బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. అందుకే కొలెస్ట్రాల్‌ను టైమ్‌కు కంట్రోల్‌లో ఉంచుకోవడం ఇంపార్టెంట్.


కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇది మరింత ఎక్కువగా పెరుగుతుంది. డైలీ లైఫ్‌లో కొన్ని చెడు అలవాట్లను మానుకుంటే మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ హ్యాబిట్స్ మొదట్లో చిన్నవిగా అనిపించినా.. దీర్ఘకాలంలో మన ఆరోగ్యానికి పెద్ద సమస్యలను తెచ్చిపెడతాయి.

బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్

ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కొలెస్ట్రాల్ పెరగడానికి మెయిన్ రీజన్స్. రెడ్ మీట్, నెయ్యి, పన్నీర్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో చేసిన ఫుడ్స్ దీన్ని బాగా పెంచుతాయి. ఇవి బ్లడ్ వెసెల్స్‌లో ఫ్యాట్ చేరడానికి దారి తీస్తాయి. గుండె ఆరోగ్యం కోసం వీటిని తక్కువగా తినాలి.

ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్స్

బర్గర్, పిజ్జా, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) లెవెల్స్‌ను పెంచడమే కాకుండా.. గుడ్ కొలెస్ట్రాల్ (HDL) లెవెల్‌ను తగ్గిస్తాయి. వీటిని తక్కువగా తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంటుంది.

యాక్టివిటీ లేకపోవడం

డైలీ కరెక్ట్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోతే బాడీలో ఫ్యాట్ పేరుకుపోతుంది. ఎక్సర్‌సైజ్ లేకుండా ఎక్కువ టైమ్ కూర్చుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవచ్చు. మార్నింగ్ లేచి కొద్దిసేపు వాకింగ్, లైట్ ఎక్సర్‌సైజ్ లాంటి హ్యాబిట్స్ పెంచుకోవడం చాలా అవసరం.

స్మోకింగ్, ఆల్కహాల్

ఈ రెండు హ్యాబిట్స్ గుండె ఆరోగ్యాన్ని చాలా డ్యామేజ్ చేస్తాయి. ఇవి గుడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బ్లడ్ వెసెల్స్‌లో ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. వీటిని పూర్తిగా మానేయడం బెటర్.

స్ట్రెస్, నిద్రలేమి

స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కార్టిసాల్ హార్మోన్ లెవెల్ పెరుగుతుంది. ఇది బాడీలో ఫ్యాట్ స్టోరేజ్‌ను బ్యాలెన్స్ లేకుండా చేస్తుంది. కరెక్ట్‌గా నిద్ర లేకపోవడం వల్ల బాడీకి పూర్తిగా రెస్ట్ దొరకదు. ఎక్కువ కాలం స్ట్రెస్ కూడా కొలెస్ట్రాల్‌ను ఎఫెక్ట్ చేస్తుంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్

కుకీస్, కేక్స్, చాక్లెట్స్, స్వీట్స్, కోల్డ్ డ్రింక్స్ లాంటి ఫుడ్స్‌లో షుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిసరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను స్పీడ్‌గా పెంచుతాయి. అందుకే వీటిని తినడం మానేయడం లేదా తక్కువగా తీసుకోవడం మంచిది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే లైఫ్‌లో చిన్న చిన్న చేంజెస్ తీసుకురావాలి. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయాలంటే మనమే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఫిజికల్ వర్క్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ తగ్గించుకోవడమే మార్గం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.