ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్లలో ఫ్రీ వై-ఫై.. ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే..

భారత ప్రభుత్వం (GoI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. ఇండియన్ రైల్వేకు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం.. డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6వేల 115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత హైస్పీడ్‌ వై-ఫై సౌకర్యం కల్పిస్తోంది.

భారత ప్రభుత్వం (GoI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. ఇండియన్ రైల్వేకు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం.. డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6వేల 115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత హైస్పీడ్‌ వై-ఫై సౌకర్యం కల్పిస్తోంది. రైల్వే ప్రయాణికులకు హైస్పీడ్‌ వై-ఫై కల్పిస్తున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌, ముంబయి, కాచిగూడ, సికింద్రాబాద్‌ మొదలైన 6,115 రైల్వే స్టేషన్లలో సహా ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.


రైల్వే సౌకర్యాలపై, ఉచిత వై-ఫై సేవ ఉన్న మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్యపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ వై-ఫై సదుపాయంతో ప్రయాణికులు సినిమాలు, పాటలు, గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. అత్యవసరమైన సమయాల్లో స్టేషన్‌ పరిసరాల్లో ఆఫీస్‌ వర్క్‌ కూడా చేసుకోవచ్చని తెలిపారు.. రైల్వే సహకార సంస్థ ‘రైల్‌టెల్‌’ సహకారంతో దీనిని అందిస్తున్నట్లు తెలిపారు

“భారతీయ రైల్వేలలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించే 4G/5G కవరేజ్ ఉంది. ఈ నెట్‌వర్క్‌లను ప్రయాణికులు డేటా కనెక్టివిటీ కోసం కూడా ఉపయోగిస్తున్నారు.. ఫలితంగా ప్రయాణీకుల అనుభవం మెరుగుపడుతుంది. పైన పేర్కొన్న వాటితో పాటు, 6115 రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi సేవలు కూడా అందించబడ్డాయి” అని వైష్ణవ్ అన్నారు.

రైల్వే స్టేషన్లలో Wi-Fi ని ఎలా కనెక్ట్ చేయాలి?

ఉచిత Wi-Fi సేవలను ఉపయోగించి, ప్రయాణీకులు స్టేషన్ ప్రాంగణంలో హై డెఫినిషన్ (HD) వీడియోలను చూడవచ్చు.. సినిమాలు, పాటలు, ఆటలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఇంకా వారి ఆఫీస్ పని కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.

రైల్వే స్టేషన్‌లో Wi-Fiని ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం..

మీ స్మార్ట్‌ఫోన్‌లో Wi-Fi మోడ్‌ను ఆన్ చేయండి.

RailWire Wi-Fi నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.

మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, SMS ద్వారా వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) పొందండి.

OTP ని నమోదు చేసి, హై స్పీడ్ Wi-Fi ని యాక్సెస్ చేయడం ప్రారంభించండి.

రైల్వే స్టేషన్లలో వై-ఫై సేవలను రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌టెల్ అందిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.