మహాకవి గురజాడ అప్పారావు ఇంట్లో మద్యం మత్తులో ఆకతాయిలు భీభత్సం సృష్టించారు. గురజాడ అప్పారావు నివాసం ఒక చారిత్రక స్థలంగా ఆర్కియాలజీ శాఖ పర్యవేక్షిస్తుంది. గురజాడ నివాసానికి తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. విజయనగరం కోట జంక్షన్ లో ఉన్న గురజాడ నివాసంలో ఆయన వాడిన వస్తువులతో పాటు ఆయన రచించిన ప్రసిద్ధ రచనలు అందుబాటులో ఉంటాయి.
మహాకవి గురజాడ అప్పారావు ఇంట్లో మద్యం మత్తులో ఆకతాయిలు భీభత్సం సృష్టించారు. గురజాడ అప్పారావు నివాసం ఒక చారిత్రక స్థలంగా ఆర్కియాలజీ శాఖ పర్యవేక్షిస్తుంది. గురజాడ నివాసానికి తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. విజయనగరం కోట జంక్షన్ లో ఉన్న గురజాడ నివాసంలో ఆయన వాడిన వస్తువులతో పాటు ఆయన రచించిన ప్రసిద్ధ రచనలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఆయన పై అధ్యయనం చేసిన పుస్తకాలు, రచనలు, పలు భాషల్లోకి అనువదించిన పుస్తకాలతో పాటు పలు కీలక పత్రాలు కూడా ఉంటాయి. ఆయన రచించిన ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం వంటి అనేక రచనలకు ఈ నివాసమే జన్మస్థలంగా నిలిచింది.
అంతటి ఘన చరిత్ర ఉన్న గురజాడ నివాసంలో ఆకతాయిలు మద్యం మత్తులో ఇంటి ప్రహరీ గోడ దూకి వెనుక వైపు ఉన్న తలుపులు పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న గురజాడ విలువైన వస్తువులను, ముఖ్యంగా ఆయన రాసిన రచనలు, పుస్తకాలతో పాటు ఇతర సాహిత్య సంపదను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గురజాడ రచనలతో పాటు, ఆయన వాడిన కొన్ని వ్యక్తిగత వస్తువులు కూడా నాశనమైనట్లు తెలుస్తోంది.
ఇదే విషయం ఇప్పుడు గురజాడ అభిమానులతో పాటు సాహితీవేత్తలను సైతం తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. గురజాడ ఇల్లు చారిత్రక స్థలంగా గుర్తించబడినప్పటికీ తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఈ ఇంటిని ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించినప్పటికీ సరైన నిర్వహణ, భద్రతా చర్యలు లేకపోవడం వల్ల తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
గతంలో కూడా ఈ ఇంట్లో చోరీలు ఘటనలు జరిగాయి. కావున ఇప్పటికైనా గురజాడ నివాసానికి పటిష్టమైన భద్రత చర్యలు కల్పించాలని గురజాడ అభిమానులు, కుటుంబసభ్యులు గురజాడ ఇందిరా శ్రీనివాస్ కోరుతున్నారు. అయితే గురజాడ నివాసానికి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
































