EPFO గోల్డెన్ ఛాన్స్‌.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) గోల్డెన్ ఛాన్స్‌ అందిస్తుంది. ఎన్ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (EO)/ అకౌంట్‌ ఆఫీసర్‌ (AO), అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ (APFC) పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.


సెలెక్ట్ అయ్యే వారికి మంచి వేతనం సెంట్రల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ లభిస్తాయి. అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు, విద్యార్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, సహా పలు వి మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం ఖాళీలు – 230 పోస్టులు

ఎన్ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ / అకౌంట్‌ ఆఫీసర్‌ – 156 పోస్టులు

యూఆర్‌: 78

ఈడబ్ల్యూఎస్‌: 01

ఓబీసీ: 42

ఎస్సీ: 23

ఎస్టీ: 12

పీడబ్ల్యూబీడీ: 09

అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ – 74 పోస్టులు

యూఆర్‌: 32

ఈడబ్ల్యూఎస్‌: 07

ఓబీసీ: 28

ఎస్సీ: 07

పీడబ్ల్యూబీడీ: 03

విద్యార్హత..

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పాస్‌ అయి ఉండాలి.

ప్రాధాన్యత: కంపెనీ లా / లేబర్ లా / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా లేదా అనుభవం ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యం.

వయో పరిమితి..

ఎన్ఫోర్స్‌మెంట్‌ / అకౌంట్‌ ఆఫీసర్‌: 30 ఏళ్లు మించరాదు.

APFC పోస్టులు: 35 ఏళ్లు మించరాదు.

వయో సడలింపు:

ఓబీసీ – 3 ఏళ్లు

ఎస్సీ/ఎస్టీ – 5 ఏళ్లు

పీడబ్ల్యూబీడీ – 10 ఏళ్లు

ఎంపిక విధానం..

కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CRT)

ఇంటర్వ్యూ

జీతం..

EO/AO పోస్టులు: లెవెల్-8 పే స్కేల్ (₹47,600 – ₹1,51,100 + అలవెన్సులు)

APFC పోస్టులు: లెవెల్-10 పే స్కేల్ (₹56,100 – ₹1,77,500 + అలవెన్సులు)

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు లభించే HRA, DA, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తు గడువు..

దరఖాస్తు ప్రారంభం: 2025 జూలై 29

దరఖాస్తు ముగింపు: 2025 ఆగస్ట్ 18

దరఖాస్తు ఫీజు..

ఒక పోస్టుకు రూ.25

రెండు పోస్టులకు రూ.50

SC/ST/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు

పరీక్షా కేంద్రాలు..

దేశ వ్యాప్తంగా 78 ముఖ్య నగరాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీలో అయితే హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం నగరాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

దరఖాస్తు విధానం..

అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అన్ని డాక్యుమెంట్స్ & ఫోటో/సిగ్నేచర్ స్కాన్ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి. కాగా ఒకేసారి రెండు పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.