ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు వచ్చింది? తొలి పూజ వినాయకుడికే ఎందుకు చెయ్యాలో తెలుసుకోండి

భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి హడావిడి కూడా మనకి కనబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. ఈసారి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది? వినాయక చవితి తేదీ, శుభసమయంతో పాటుగా తొలి పూజ వినాయకుడికే ఎందుకు చెయ్యాలో తెలుసుకోండి.

వినాయకుడిని ఆరాధిస్తే ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా బయటపడొచ్చు. మొట్టమొదట ఏ దేవుడిని పూజించాలన్నా, మొట్టమొదట పూజలు అందుకుంటాడు గణపతి. హిందువులు ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి హడావిడి కూడా మనకి కనబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. ఈసారి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది? వినాయక చవితి తేదీ, శుభసమయంతో పాటుగా మరిన్ని వివరాలను తెలుసుకుందాం.


ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు వచ్చింది?

ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 27, బుధవారం నాడు వచ్చింది. వినాయక చవితి నాడు ఇళ్లల్లో, వీధుల్లో వినాయకుని మండపాలు పెట్టి, వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. వినాయక చవితి నాడు విజ్ఞానాన్ని తొలగించే వినాయకుడిని పూజించి, పత్రాలతో పూజలు చేస్తారు. కుడుములు, ఉండ్రాళ్ళు, పిండివంటల్ని నైవేద్యంగా పెట్టాలి. పండ్లు, పానకం, వడపప్పుని కూడా బొజ్జ గణపతికి నైవేద్యంగా పెట్టాలి. వినాయకుడికి ఇష్టమైన గరికను తప్పకుండా సమర్పించాలి.

తొలి పూజ వినాయకుడికి ఎందుకు చేయాలి?

వినాయకుడిని ఆరాధించడం వలన ఏ కష్టమైనా సరే తొలగిపోతుందని, కుటుంబ జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని అందరూ నమ్ముతారు. పురాణాల ప్రకారం చూస్తే గణేశుడికి మొదట పూజ చేస్తారు. మొట్టమొదట ఎవరికీ పూజ చేయాలి అనే విషయంలో దేవతలందరూ కొట్టుకున్నారు. వారిలో వారు పొట్లాడుకుంటుంటే నారదుడు వచ్చాడు. దేవతలందరూ శివుని వద్దకు వెళ్లమని నారదుడు సలహా ఇచ్చాడు. దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్తారు.

శివుడు ఒక పోటీ పెడతాడు. ఈ పోటీలో ఎవరు గెలిస్తే వారే మొదటి పూజలు అందుకుంటారని చెబుతాడు. దేవతమూర్తులు తమ వాహనాల్లో విశ్వమంతా ప్రదక్షిణలు చేయాలని శివుడు చెబుతాడు. ఎవరైతే మొత్తం అంతా తిరిగి ముందు వస్తారో వారినే మొట్టమొదట పూజించాలని అంటాడు.

విశ్వయాత్ర

దేవతమూర్తులు అందరూ వాహనాలు తీసుకుని విశ్వయాత్రకు వెళ్తారు. ఈ సమయంలో గణపతి ఆలోచనలో పడ్డాడు. గణేశుడు వాహనం ఎలుక. ఎలుక చాలా చిన్నగా ఉంటుంది. పైగా గణపతి కూడా నెమ్మదిగా నడుస్తాడు. ఇది దాదాపు అసాధ్యమని అనుకున్నాడు. అప్పుడు శివ పార్వతులకి ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి, ముందు నిలబడ్డాడు. దేవతలందరూ విశ్వానికి ప్రదక్షిణలు చేసి వస్తారు.

అప్పుడు వినాయకుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శివుడు గణేశుడిని విజేతగా ప్రకటించాడు. ఏ పిల్లలకైనా సరే, తల్లిదండ్రులే ప్రపంచం. మొదటి పూజ తల్లిదండ్రులకి చేయాలని, తల్లిదండ్రుల తర్వాతే అందరికి పూజ చెయ్యాలని గణేశుడు చెప్పాడు. ఇలా వినాయకుడు విజేత అవుతాడు. అప్పటినుంచి వినాయకుడు తొలి పూజను అందుకుంటున్నాడు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.