మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్స్ విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. జూన్ 6 నుంచి జులై 2 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల స్కోర్ కార్డ్స్ ను విద్యాశాఖ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే.


అయితే వీటిపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో కూడిన స్కోర్ కార్డులను ఈరోజు రాత్రి అధికారిక వెబ్సైట్ లో విడుదల చేయనుంది. కాగా టెట్ మార్కుల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే సైట్ లో సరిచేసుకోవడానికి గురువారం రాత్రి వరకు సమయం ఇస్తున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. ఏపీ వ్యాప్తంగా ఖాళీగా 16,347 టీచర్ పోస్టులకు ప్రభుత్వం జూన్, జులై నెలల్లో మెగా డీఎస్ సీ నిర్వహించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.