పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైకాపాకు ఘోర పరాభవం ఎదురైంది. ఫలితాల్లో తెదేపా అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6,035 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
వైకాపా అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైకాపాకు 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్ నమోదైంది.
తెదేపా అభ్యర్థిని మంత్రి సవిత అభినందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామన్నారు. ఈ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.




































