విటమిన్ బి12 శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయ పడుతుంది. ముఖ్యంగా కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు,వెన్నుపాము నాడీ వ్యవస్థ) సరిగా పనిచేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
బి12 లోపం కారణంగా స్త్రీలలో అలసట, కాళ్ళలో జలదరింపు లేదా నిరాశ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బి12 లోపం లక్షణాలు పురుషులు, స్త్రీలలో దాదాపు ఒకే విధంగా ఉంటాయి, కానీ ఈ లోపం పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ కాలం లోపం ఉంటే, అది తీవ్రమైన నరాల సమస్యలు, ఆస్టియోపోరోసిస్‌కు కారణమవుతుంది.
మహిళల్లో విటమిన్ బి12 లోపంలక్షణాలు ఎలా ఉంటాయంటే..?
అలసట
జ్ఞాపకశక్తి బలహీనపడటం
తలనొప్పి
మసకగా కనిపించడం
విరేచనాలు
శ్వాస ఆడకపోవడం
తిమ్మిరి లేదా జలదరింపు
నిరాశ లేదా ఆందోళన..
ఇతర సంకేతాలు..
మహిళల్లో విటమిన్ బి12 లోపం రక్తహీనతకు కారణమవుతుంది. దీని కారణంగా నడవడంలో ఇబ్బంది, ఆకస్మికంగా బరువు తగ్గడం, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ , నరాలకు నష్టం కలిగిస్తుంది. రక్తహీనత, బి12 లోపం మహిళల్లో వంధ్యత్వానికి కూడా కారణమవుతుంది.
గమనిక:ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
































