వరుస సెలవులు రావడంతో ఈ వీకెండ్ వినోదాల కోసం ప్లాన్ చేసుకుంటున్నారా?థియేటర్లో భారీ యాక్షన్ చిత్రాలకు టికెట్స్ దొరకలేదా? అయితే, మిమ్మల్ని అలరించడానికి ఓటీటీ వేదికగా పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.
మరి ఏ ఓటీటీలో ఓ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
థ్రిల్ పంచే.. ‘కానిస్టేబుల్ కనకం’
వరుస చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో అలరిస్తున్న తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ (ETV Win). ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్‌తో కథతో అలరించడానికి సిద్ధమైంది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ (Constable Kanakam). ప్రశాంత్ కుమార్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
భయపెట్టే సిరీస్..
ప్రేక్షకులను అలరించడానికి మరో హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ సిద్ధమైంది. ‘అంధేరా’ (Andhera) ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) స్ట్రీమింగ్కు వచ్చింది. కరణ్వీర్ మల్హోత్రా, ప్రియా బాపట్, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాఘవ్ ధర్ తెరకెక్కించారు.
వివాదాల మధ్య విడుదలై..
సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చనీయాంశమైన సినిమాల్లో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala) ఒకటి. ఎట్టకేలకు జులై 17న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలో మలయాళంలోనే విడుదలైన ఆగస్టు 15 నుంచి ‘జీ 5’ (Zee 5)లో మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు
- ఆహా తమిళ్
- అక్కేనమ్ (మూవీ) ఆగస్టు 15
- యాదుమ్ అరియాన్ (మూవీ) ఆగస్టు 15
- సన్‌నెక్ట్స్
- గ్యాంబ్లర్స్ (మూవీ) ఆగస్టు 15
- జియోహాట్ స్టార్
- ఏలియన్ ఎర్త్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది.
- మోజావే డైమండ్స్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది
- నెట్‌ఫ్లిక్స్
- సారే జహాసే అచ్చా (హిందీ మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది
- మా (హిందీ)
- రోల్ మోడల్స్ (మూవీ)
- అవుట్ ల్యాండర్ (వెబ్‌సిరీస్) సీజన్ 7
- సెల్ఫ్ రిలయన్స్ (మూవీ)
- లవ్ ఈజ్ బ్లైండ్ యూకే (వెబ్‌సిరీస్: సీజన్2)
- సాంగ్స్ ఫ్రమ్ ది హోల్ (మూవీ)
- ఫిక్స్డ్ (మూవీ)
- ఫిట్ ఫర్ టీవీ (రియాల్టీ షో)
- మిస్ గవర్నర్ (వెబ్‌సిరీస్:సీజన్1)
- ఎంఎక్స్ ప్లేయర్
- సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషషన్ (మూవీ)
- జీ5
- టెహ్రాన్ (హిందీ చిత్రం) స్ట్రీమింగ్ అవుతోంది.
- సోనీలివ్
- కోర్ట్ కచేరీ (హిందీ సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది.
































