మోసపోయేవాళ్లు ఉన్నంతవరకు మోసం చేసేవాళ్లు కూడా ఉంటారనే ఓ సామెత ఉంది. ప్రస్తుతం ఇలాంటి మోసాలు పెరిగిపోయాయి. కాస్త అమాయకంగా కనిపిస్తే చాలు నిండా ముంచేస్తారు.
కాబట్టి చాలా అలర్ట్ గా ఉండాలి. కేవలం ఆన్ లైన్ మోసాలే కాదు ఆఫ్ లైన్ మోసాల్లోనూ కొత్త దారులు వెతికి మరీ మోసం చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా చేతితో ఎవరికి అయినా డబ్బు లు ఇస్తే మోసం చేయడం కుదరదు అనుకుంటారు. అవి నఖిలీ నోట్లా లేదాంటే ఒరిజినల్ నోట్లా అనేది మాత్రమే పరిశీలిస్తారు.
కానీ ఒరిజినల్ నోట్లు ఇచ్చి కూడా మోసం చేయవచ్చు అనే సంగతి చాలా మందికి తెలియదు. కానీ నోట్ల కట్ట ఇచ్చి ఎలా మోసం చేయవచ్చో తెలిపే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నోట్ల కట్లలో మధ్యలో కొన్ని నోట్లను గమ్ తో అతికించారు. నోటును మడిచి గమ్ తో అతకపెట్టడంతో అవి లెక్కించేటప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి డబ్బులు తీసుకునేవారు అప్రమత్తంగా ఉండకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. డబ్బులు లెక్కపెట్టే సమయంలో నోట్ల కట్ట పైన మాత్ర కాకుండా కింద కూడా గమనించారు. దాని పరిమాణంలో తేడా అనిపిస్తే రెండు వైపులా లెక్కించాలి. ఇలా చేయడం ద్వారా మోసపోకుండా ఉండవచ్చు.
































