జాతీయ పతాకం ఎగరవేయడానికి.. జాతీయ జెండా ఆవిష్కరించడానికీ ఉన్న తేడా తెలుసా..

 ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన దేశ ప్రధాన మంత్రి న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ..2014 నుంచి వరుసగా 12వ సారి ఎర్రకోట పై జాతీయ జెండాను ఎగరబోతున్నారు.


ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. తెల్లవాడి పరిపాలన నుంచి మన దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించయాయి. దీనికి గుర్తుగా దేశ మువ్వన్నెల జెండాను పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను కిందికి దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరువేశారు. మనకు ఇండిపెండెన్స్ డే కు గుర్తుగా ఇలా మన దేశ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా అని చెప్పలి. .

రిపబ్లిక్ డే జనవరి 26 నాడు భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన మువ్వెన్నల జెండాను పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా మన దేశ జెండాను ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయం దీని వెనక ఉద్దేశ్యం. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడించడం విశేషం.దేశ ప్రజలకు ప్రతినిధి, మన దేశ పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాన మంత్రి ఇండిపెండెన్స్ రోజున జాతీయ పతాకం ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.

దేవ స్వాతంత్ర్యం సిద్దించిన సమయంలో మనకు భారత రాజ్యాంగం అమల్లో లేదు.అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మన జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన తేడా ఏమిటంటే..స్వాతంత్య్ర దినోత్సవ రోజున సందర్భంగా భారత దేశ ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting).రిపబ్లిక్ డే నాడు భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling).ఈ రెండింటికి ఇంకొక స్పష్టమైన వ్యత్యాసం ఉంది. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు వేరే వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో ఘనంగా జరుగుతుంది. ఈ సారి 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు కర్తవ్యపథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.