ఏపీ మెగా డీఎస్సీ ప్రక్రియ తుది దశకు చేరింది. తాజాగానే స్కోర్ కార్డులు కూడా విడుదలయ్యాయి. అయితే టెట్ మార్కుల సవరణకు విద్యాశాఖ మరో అవకాశం ఉంది. ఈ విషయంలో సవరణలు చేసుకునేవాళ్లు ఇవాళ్టితో(ఆగస్ట్ 15) ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఏపీ డీఎస్సీ ప్రక్రియకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. సవరించిన డీఎస్సీ తుది మార్కుల స్కోర్ కార్డులు అందుబాటులోకి రాగా.. టెట్ మార్కుల విషయంలో విద్యాశాఖ మరో ఛాన్స్ ఇచ్చింది. టెట్ స్కోర్ కార్డుల్లో ఏమైనా అభ్యంతరాలుంటే ఆన్లైన్లో సరిచేసుకోవచ్చని సూచించింది. ఈ గడువు శుక్రవారం(ఆగస్ట్ 15)తో పూర్తవుతుందని స్పష్టం చేసింది.
ఇప్పటికే సవరించిన టెట్ మార్కులతో కూడిన స్కోర్ కార్డులను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంకా ఏవరైనా ఉంటే కూడా వెంటనే టెట్ స్కోర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.
అందుబాటులోకి సవరించిన స్కోర్ కార్డులు..!
ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అభ్యర్థులు… సవరించిన మార్కులు చూసుకోవచ్చని డీఎస్సీ కన్వీనర్ తెలిపారు. స్కోర్ కార్డు కోసం ముందుా ఏపీ డీఎస్సీ అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ముందుగా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్లాలి. ఇక్కడ హాల్టికెట్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆపై సర్వీసెస్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత ఏపీ డీఎస్సీ ఫలితాలను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీ స్కోరు కార్డు అందుబాటులోకి వస్తుంది. అభ్యర్థులు రాసిన ఎగ్జామ్ పేపర్లు, సాధించిన స్కోరు వివరాలు ఉంటాయి. టెట్ స్కోరును పేర్కొంటూ క్వాలిఫైడ్/నాన్ క్వాలిఫైడ్ అనే వివరాలు కూడా డిస్ ప్లే అవుతాయి.
మెరిట్ లిస్టులు ఎప్పుడు…?
ఇక స్కోర్ కార్డులు అందుబాటులోకి రావటంతో అభ్యర్థులంతా మెరిట్ లిస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ మార్కుల సవరణ ప్రక్రియ ఇవాళ్టితో పూర్తవుతుంది. ఆ వెంటనే ఏ క్షణమైనా జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాల అప్డేట్స్ కోసం https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు. లేదా జిల్లాల డీఈవోల కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఇక మెగా డీఎస్సీ ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఈనెలాఖారు నాటికి మొత్తం నియామకాల యప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఇక ఈ డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.మొత్తంగా చూస్తే ఈనెలాఖారు నాటికి కొత్త టీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
































