మహీంద్రా కంపెనీ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌తో మోస్ట్ అవైటెడ్ బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఈవీని లాంచ్ చేసింది. కేవలం 300 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అమ్మకానికి తీసుకురానున్నారు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌తో మహీంద్రా కొత్త బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేశారు. ఈ కారు ఇతర డార్క్ ఎడిషన్ల కంటే భిన్నంగా ఉంటుంది. కొత్త మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధర రూ. 27.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆగస్టు 23 నుండి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 20 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి. కేవలం 300 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తారు.
ఈ కారు ఆకర్షణీయమైన బయటి డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ప్రామాణిక బీఈ6 మోడల్ మాదిరిగానే ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, జె ఆకారపు డీఆర్ఎల్లు, 20-అంగుళాల చక్రాలు, ఫ్లష్ పాప్ అవుట్ డోర్ హ్యాండిల్స్, ఫంకీ స్పాయిలర్, టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. కొత్త బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్ ఆప్షన్లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో ముందు తలుపులపై కస్టమ్ బ్యాట్‌మ్యాన్ డెకాల్స్, టెయిల్‌గేట్‌పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్లు, వీల్ హబ్ క్యాప్‌లపై బ్యాట్‌మ్యాన్ లోగో కూడా ఉన్నాయి.
కొత్త మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లోపలి భాగం చాలా బాగుంది. దీనికి పూర్తిగా నల్లటి పెయింట్ స్కీమ్ ఉంది. డ్యాష్‌బోర్డ్‌లో ఆల్కెమీ గోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్క్రీన్‌లో కస్టమ్ బ్యాట్‌మ్యాన్ యానిమేషన్ ఆప్షన్ ఉంది. ఇది రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, మాగ్నెటిక్ కీ-ఫాబ్లు, వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్లు, 16-స్పీకర్ హర్మాన్ మ్యూజిక్ సిస్టమ్ వంటి అనేక లక్షణాలను కూడా పొందుతుంది.
ఇది శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. దీనికి 79కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటారు 285 పీఎస్ హార్స్పవర్, 380 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారులో 5 సీట్ల ఆప్షన్ ఉంది. వారాంతాల్లో, సెలవు దినాల్లో ఎక్కువ లాగేజీ తీసుకెళ్లడానికి ఇది 455 లీటర్ల బూట్ స్థలాన్ని కలిగి ఉంది. 207 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 2,775 ఎంఎం వీల్‌బేస్ ఉంది. కొత్త మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ దాని సేఫ్టీకి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది 7 ఎయిర్‌బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, లెవల్ 2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరాతో వస్తుంది.
































