కొత్త వివో T4 ప్రో ఫోన్ వస్తోంది.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

వివో ఫ్యాన్స్ కోసం సరికొత్త ఫోన్ రాబోతుంది. వివో T-సిరీస్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో కొత్త వివో T4 ప్రో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా (Vivo T4 Pro) ధృవీకరించింది.


వివో T4 సిరీస్ ఫోన్ ఫస్ట్ అధికారిక టీజర్‌ ఎక్స్ ద్వారా కంపెనీ షేర్ చేసింది. వివో T4 ప్రో బ్యాక్ డిజైన్, లభ్యత వివరాలను కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి త్వరలో ఈ వివో ఫోన్ అమ్మకానికి రానుంది.

వివో T4 ప్రో లాంచ్ తేదీ :
ఈ వివో ప్రో లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అతి త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని కంపెనీ సూచించింది. ప్రస్తుతం వివో T4 5G, వివో T4 లైట్ 5G, వివో T4R 5G, వివో T4x 5G మోడల్‌లు ఉన్నాయి.

వివో T4 ప్రో డిజైన్, స్పెసిఫికేషన్లు :
వివో ఫోన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో రానుంది. బ్యాక్ సైడ్ పిల్ ఆకారపు కెమెరా ఐలాండ్ ఉంది. ముఖ్యంగా, హ్యాండ్‌సెట్ 3x పెరిస్కోప్ జూమ్‌ కలిగి ఉండొచ్చు. “టెలి లెన్స్” బ్రాండింగ్‌ను కలిగి ఉంది. ఇమేజింగ్, పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ ఏఐ ఆధారిత అప్‌గ్రేడ్ కలిగి ఉంటుందని వివో వెల్లడించింది.

కంపెనీ మరిన్ని వివరాలను రివీల్ చేయలేదు. లీక్‌ల ప్రకారం.. వివో T4 ప్రో ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉండొచ్చు. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. ఈ వివో 50MP సోనీ IMX882 ప్రైమరీ లెన్స్‌తో సహా కెమెరా అప్‌గ్రేడ్ అందిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.