పురాతన కాలం నుంచి భారతీయ ఆహారంలో పండ్లు ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ప్రతి పండుకు దాని స్వంత ప్రయోజనాలు ఉన్నాయి.. వాటిని సరైన పరిమాణంలో.. సరైన సమయంలో తీసుకోవడం ద్వారా మీరు వాటి లాభాలను పొందవచ్చు..
అలాంటి అద్భుతమైన పండ్లలో దానిమ్మ ఒకటి.. ఖాళీ కడుపుతో దానిమ్మ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని.. శరీరాన్ని రిపేర్ చేసుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. దానిమ్మ శరీరాన్ని శక్తితో నింపడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా.. హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది.. అందుకే.. అనేక వైద్య అధ్యయనాలలో దానిమ్మను సూపర్ ఫ్రూట్‌గా పేర్కొన్నారు..
దానిమ్మలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, పొటాషియం, జింక్ – ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను సరిగ్గా నిర్వహించడంలో, చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో దానిమ్మ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది
ఖాళీ కడుపుతో దానిమ్మపండు తినడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడదు.. దానిలో ఉండే సహజ నీరు, ఖనిజాలు శరీరాన్ని రోజంతా తాజాగా, శక్తివంతంగా ఉంచుతాయి. శరీరానికి ఉదయం పూట హైడ్రేషన్ ఎక్కువగా అవసరం. అటువంటి పరిస్థితిలో దానిమ్మపండు దానికి అద్భుతమైన మూలంగా పేర్కొంటున్నారు.
సోమరితనం తగ్గుతుంది
దానిమ్మలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీర శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అవి రోజులోని అలసటను దూరం చేసి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర శక్తి స్థాయి మెరుగుపడుతుంది.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది
దానిమ్మలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇంకా వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. అలాగే, ఇది చర్మ తేమను కాపాడుతుంది. చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. మెరిసే చర్మం కోసం దానిమ్మ తినాలని చర్మవ్యాధి నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు.
వాపుతో పోరాడుతుంది
దానిమ్మలో కనిపించే శోథ నిరోధక లక్షణాలు శరీరంలోని సాధారణ వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం.. దానిమ్మను రోజూ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక శోథ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణక్రియ – గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
ఖాళీ కడుపుతో దానిమ్మ తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు సక్రియం అవుతాయి. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడుతుంది. అలాగే, దానిమ్మ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండెను బలపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
































