కొలెస్ట్రాల్‌ తగ్గాలంటే పళ్లు తోముకోకముందు ఈ ఒక్కటి తినండి చాలు

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని బాధపడుతున్నారా? అయితే, ఉదయాన్నే పళ్లు తోముకోకముందు కొన్ని నానబెట్టిన బాదం పప్పులు తినడం అలవాటు చేసుకోండి.


ఇది మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. బాదం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. కానీ, వాటిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో తింటేనే మంచి ప్రయోజనాలు లభిస్తాయి. పోషకాహార నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం పప్పులను తింటే, వాటిలోని పోషకాలు శరీరానికి చాలా వేగంగా అందుతాయి.

బాదం పప్పులను నానబెట్టి ఎందుకు తినాలి?

సాధారణంగా పళ్లు తోముకోక ముందు మన నోటిలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. నానబెట్టిన బాదం పప్పులను ఈ సమయంలో తింటే, ఈ బ్యాక్టీరియా వాటిని సులభంగా జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీంతో శరీరానికి బాదం నుంచి అన్ని పోషకాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు 20 నుంచి 30 గ్రాముల బాదం పప్పులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యానికి..

బాదం పప్పులో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు, కండరాల ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా, బాదంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. బాదం పప్పు చెడు కొలెస్ట్రాల్‌ (LDL)ను తగ్గించి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బాదంలో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు గుండెపోటుకు ప్రధాన కారణం. కాబట్టి, ప్రతిరోజూ బాదం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. బాదం పప్పులు కేవలం గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు, బరువు తగ్గడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి కూడా ఉపయోగపడతాయి. బాదంలో ఉండే ఫైబర్, ప్రొటీన్ మన కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. దీనివల్ల తరచుగా ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా అనవసరంగా ఎక్కువ తినకుండా బరువును నియంత్రించుకోవచ్చు.

బాదంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఇవన్నీ కాకుండా, బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా బాదం చాలా మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.