చిత్రం, నువ్వునేను, జయం, సంబరం, జై, ధైర్యం, ఔనన్నా కాదన్నా.. ఇలా ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు డైరెక్టర్ తేజ. అంతేకాదు తన ల ద్వారా ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, కాజల్ అగర్వాల్, ప్రిన్స్, నందిత వంటి స్టార్ హీరోలు, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అయితే గత కొన్నేళ్లుగా తేజకు సరైన లు పడడం లేదు. 2017లో ఆయన తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి మాత్రమే హిట్ గా నిలిచింది. దీనికి ముందు, తర్వాత తేజకు చాలా ఫ్లాప్ లు పడ్డాయి. గత కొంత కాలంగా లకు దూరంగానే ఉన్న తేజ సరైన కథతో సక్సెస్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తన కుమారుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. తన దర్శకత్వంలోనే ఒక ప్రేమకథతో అమితవ్‌ను హీరోగా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు షోషల్‌మీడియాలో కొన్ని తెగ చక్కర్లు కొడుతున్నాయి.
కాగా సుమారు రెండేళ్ల క్రితం విక్రమాదిత్య పేరుతో ఒక పీరియాడిల్ ఎపిక్ లవ్‌స్టోరీని ప్రకటించారు తేజ. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా అప్పట్లోనే విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈతోనే తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్‌గా ఘట్టమనేని వారసురాలు
ఇక్కర మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇదే విక్రమాదిత్య ప్రాజెక్టుతో దివంగత నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, రమేష్‌బాబు కుమార్తె అయిన భారతిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ మేరకు గత కొన్ని రోజులుగా భారతి ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలవుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
































