మొబైల్ కు రోజుకు ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలి…100% అయినా తీయకుండా అలాగే పెడుతున్నారా?

మొబైల్ ఫోన్.. నిత్యవసర వస్తువు అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో ఈ మొబైల్ ఫోన్ ఉంటుంది. ఈ మొబైల్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకుండా..


ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారు. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు మొబైల్ ఫోన్ కు ఒకటి లేదా అవసరమైతే రెండుసార్లు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలని సూచనలు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ సార్లు మొబైల్ కు ఛార్జింగ్ పెడితే బ్యాటరీ మొత్తం పోతుందని అంటున్నారు.

మొబైల్ కు ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెడితే.. అది వేడెక్కి.. పేలిపోయే సంఘటనలు కూడా జరుగుతాయట. ఇక 20% వచ్చినప్పుడు ప్లీజ్ కనెక్ట్ ఛార్జ్ అన్నప్పుడు మాత్రమే చార్జింగ్ పెట్టాలని సూచనలు చేస్తున్నారు. అలాగే 80% ఛార్జింగ్ ఎక్కిన తర్వాత వద్దనుకుంటేనే తొలగించాలని చెబుతున్నారు. ఇక 100% ఛార్జింగ్ ఎక్కిన తర్వాత… వెంటనే తొలగించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలా కాదని ఛార్జింగ్ తొలగించకపోతే.. బ్యాటరీ పైన ఎఫెక్ట్ పడుతుందట.

ముఖ్యంగా 0% ఛార్జింగ్ అయ్యే వరకు చూసుకోవద్దని చెబుతున్నారు అలా జరిగితే మొబైల్ లో ఉన్న డాటా మొత్తం తొలగిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇక.. మన ఛార్జర్ మనమే వాడుకోవాలి. ఇతరుల ఛార్జర్ వాడితే… మన మొబైల్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే బ్యాటరీ సేవ్ అనే ఆప్షన్ ఆన్ లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.