భారీ జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న 330 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.


అర్హత కలిగిన వారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఆగస్టు 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం గురించి తెలుసుకుందాం..

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 330

ఖాళీల వివరాలు..

డిప్యూటీ మేనేజర్ – 22

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ – 18

అసిస్టెంట్ మేనేజర్ – 300

అర్హతలు..

సంబంధిత విభాగంలో డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ పాసై ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో అర్హతలు అవసరం. అలానే సంబంధిత రంగంలో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

పోస్టులు – వెకెన్సీలు..

డిప్యూటీ మేనేజర్: 22 పోస్టుల

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ : 18 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్: 300 పోస్టులు

వయస్సు పరిమితి..

కనీసం 23 ఏళ్లు – గరిష్టం 40 ఏళ్లు.

నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు.

జీతం..

విద్యార్హతలు, అనుభవం ఆధారంగా గౌరవప్రదమైన వేతనం ఇవ్వబడుతుంది.

దరఖాస్తు ఫీజు..

జనరల్/OBC/EWS – రూ.850

SC/ST/దివ్యాంగ/మహిళా/ESM – రూ.175

ఎంపిక విధానం..

సర్టిఫికేట్ వెరిఫికేషన్

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు గడువు..

జులై 30, 2025 – ఆగస్ట్ 19, 2025

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.