New Bars: కొత్త బార్లకు నేడు నోటిఫికేషన్

రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో నూతన వార్డ ఏర్పాటుకు రెండు జీవోలు విడుదల చేసింది. అందులో 275 జీవో ప్రకారం ఎక్సైజ్ శాఖ పాలసీ 276 జీవోఎం.ఎస్ ప్రకారం నిబంధనలు విడుదల చేసింది.


మూడేళ్ల పాటు లైసెన్స్ ఇవ్వనున్న ఈ బార్ల కేటాయింపును వైసీపీ ప్రభుత్వంలో వేలం పాటలు నిర్వహించగా, కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రైవేటు మద్యం దుకాణాల కేటాయింపులో పాటించిన లాటరీ వద్దతిలోనే ఈసారి కొత్త బార్లకు లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు. గతంలో ఈ-వేలం పాటల్లో రూ.కోటి వరకు పలికిన ఒక్కో బార్ లైసెన్సు. ఈసారి కొత్త పాలసీ ప్రకారం కేవలం రూ.50 లక్లలు మాత్రమే పలకనుంది. దీంతో మద్యం వ్యాపారుల మధ్య పోటీ పెరిగనున్నట్లు ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. కానీ వైసీపీ ప్రభుత్వ తప్పిదంతో ఏఈఆర్టీ 15 శాతం పెంచడంతో అనుభవం గల మద్యం వ్యాపారులు ఆలోచనలో పడిపోయారు. జిల్లాలో పెరగనున్న బార్ల సంఖ్య జిల్లాలో ఇది వరకు 11 బార్లు, హార్సిలీహిల్స్లో ఒక టూరిజం బార్ నడిచాయి. ఈనెల 31వ తేదీకి ఈ బార్ లైసెన్సులు అన్నీ రద్దు కానున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం బార్ల కేటాయింపునకు ఇవాళ (18వ తేదీ) నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటి వరకు జిల్లాలో 11 బార్లు ఉండగా, నూతన పాలసీ ప్రకారం మరో బార్ కల్లుగీత కులానికి చెందిన వారికి కేటాయించనున్నారు. దీంతో పాటు బి.కొత్తకోట లాంటి నగర పంచాయతీల్లో కూడా బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 సంవత్సరంలో ఈ-వేలం పద్ధతిలో బార్ల లైసెన్సీలను జారీ చేశారు. ఎక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన వారికి బార్ లైసెన్సులు కేటాయించారు. జిల్లాలో 11 బార్లు, ఉండగా అందులో అధికంగా 4 బార్లు మదనపల్లె పట్టణంలోనే ఉన్నాయి. ఈ నాలుగు బార్లకు గాను గత ప్రభుత్వానికి రూ.3.58 కోట్లు లైసెన్సు ఫీజు ద్వారా ఆదాయం వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం ఈ నాలుగు బార్ల లైసెన్సుల ఫీజును ఒక్కోదానికి ఈసారి కేవలం రూ.55 లక్షలు మాత్రమే కేటాయించింది. దీంతో బార్లను దక్కించుకునే వారి సంఖ్య పెరగవచ్చని తద్వారా ప్రభుత్వానికి కూడా గతంలో కన్నా ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్ శాఖాధికారులు భావిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.