ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త… ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయలు పెన్షన్.. ఎప్పటి నుంచి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సేవల పథకాన్ని ఇటీవల ప్రారంభించి, స్త్రీలకు ఆర్థిక, సామాజిక ఉపశమనం కల్పించే దిశగా కీలక చర్యలు చేపట్టింది.
సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ హామీల్లో అత్యంత ముఖ్యమైనది, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు నేరుగా ఆర్థిక సాయంగా అందించే పథకం. ఈ స్కీం అమలుపై ప్రస్తుతం విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆగస్టు 15న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ స్కీం కింద, మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచిత బస్సు టికెట్ పొందవచ్చు. ఇలాంటి పథకం ఇప్పటికే తెలంగాణలో అమలులో ఉంది. ఈ స్కీం మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ద్వారా సమీప పట్టణాల్లో ఉపాధి అవకాశాలను పొందేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు రవాణా ఖర్చులు ఆదా అవడంతో ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి ప్రత్యేక నిధులను కేటాయించింది.
అలాగే, సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా వృద్ధాప్య పెన్షన్‌ను 2000 రూపాయల నుంచి 4000 రూపాయలకు పెంచారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో 14,000 రూపాయలు జమ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో 15,000 రూపాయలు బదిలీ చేశారు. ఇప్పుడు, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అందించే పథకాన్ని త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పథకంపై రాష్ట్ర క్యాబినెట్‌లోనూ చర్చలు జరిగాయి. ఈ స్కీం అమలుపై ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది.
ఇదే తరహా పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. అక్కడ 21 నుంచి 65 ఏళ్ల వయసు గల మహిళలకు నెలకు 1500 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోందని సర్వేలు తెలిపాయి. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు త్వరలో మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశం ఉంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.
































