ప్రముఖ టెలికాం నెట్వర్క్ ఎయిర్టెల్ ప్రస్తుతం దేశంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. యూజర్లను మరింత ఆకట్టుకొనేందుకు అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను కలిగి ఉంది.
దీంతోపాటు ఉచిత హాలోట్యూన్, Xstream వంటి అనేక అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. అయితే గత నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. పెర్ఫ్లిక్సిటీ ప్రో ప్రీమియం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను యూజర్లకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ప్రో మోడల్ :
ఎయిర్టెల్ యూజర్లు సంవత్సరం వరకు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఎయిర్టెల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Telecom Talk ద్వారా ఈ వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ వివరాల ఆధారంగా ఎయిర్టెల్ గత సంవత్సరం ఆపిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యూజర్లు ఆపిల్ TV+, ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ :
ఈ ప్రయోజనాలను ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొంత మంది ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు Airtel Thanks యాప్‌లో ఆపిల్ మ్యూజిక్ ఆఫర్ వివరాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లు గరిష్ఠంగా 6 నెలల వరకు ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చని తెలుస్తోంది. గడువు ముగిసిన అనంతరం నెలవారీ రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దీనిపై ఎయిర్టెల్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
దీంతోపాటు ప్రీపెయిడ్ యూజర్లు అందిరికీ అందుబాటులో ఉంటుందా? లేదా కనీస మొత్తం రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే ఆపిల్ మ్యూజిక్ అందుబాటులోకి రానుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అన్లిమిటెడ్ 5G డేటా రీఛార్జ్ లేని యూజర్లకు కూడా థ్యాంక్స్ యాప్‌లో ఈ ఆఫర్ వివరాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
ఇటీవలే ఎయిర్టెల్ కాలింగ్, డేటా సహా 25 కు పైగా OTT రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, Zee5, SonyLIV, జియోహాట్‌స్టార్, SunNXT, Aha సహా అనేక సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది. 16 భాషల్లో కంటెంట్‌ను వీక్షించవచ్చని ఎయిర్టెల్ చెబుతోంది.
ఎయిర్టెల్ రూ.279 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్, జియోహాట్‌స్టార్ సూపర్, Zee5 ప్రీమియం, ఎయిర్టెల్ Xstream ప్లే ప్రీమియం ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 1GB డేటాను కూడా పొందవచ్చు. వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది.
రూ.598 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ కాల్స్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు అన్లిమిటెడ్ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, జియోహాట్‌స్టార్ సూపర్, Zee5 ప్రీమియం ను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్, ఉచిత హాలోట్యూన్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.































