డిప్లొమా అర్హతతో ఇస్రోలో జాబ్స్.. నెలకు లక్షపైనే జీతం.. అర్హత, దరఖాస్తు, ఎంపిక విధానం పూర్తి వివరాలు

భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ISRO) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది(ISRO Jobs). ఈ నోటిఫికేషన్ ద్వారా లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (LPSC) వివిధ విభాగాల్లోని మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనుంది.


దీనికి సంబదించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 26తో ముగియనుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్ధుకు అధికారిక వెబ్ సైట్ www.isro.gov.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు, పోస్టుల వివరాలు:

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 12
  • సబ్‌ ఆఫీసర్‌ పోస్టులు 01
  • టెక్నీషియన్‌ బి పోస్టులు 06
  • హెవీ వెహికల్‌ డ్రైవర్‌ A పోస్టులు 02
  • లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ A పోస్టులు 02

విద్యార్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ITI, డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌)/ సమానమైన అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత ఉద్యోగంలో అనుభవం కూడా ఉండాలి.(మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సబ్‌ ఆఫీసర్‌, ఫిట్టర్‌, రిఫ్రిజిరేషన్‌ & ఎయిర్‌ కండిషనింగ్‌, హెవీ వెహికల్‌ డ్రైవర్‌).

వయోపరిమితి:

అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు మించి ఉండాలి.

వేతన వివరాలు:

విభాగాల వారీగా వేతనంలో హెచ్చు, తగ్గులు ఉన్నాయి..

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 జీతం అందుతుంది.
  • సబ్‌ ఆఫీసర్‌ ఉద్యోగులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 జీతం అందుతుంది.
  • టెక్నీషియన్‌ B ఉద్యోగులకు రూ.21,700 నుంచి రూ69,100 జీతం అందుతుంది.
  • డ్రైవర్స్‌ ఉద్యోగులకు రూ.19,900 నుంచి రూ.63,200 జీతం అందుతుంది.

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మూడు విభాగాల్లో జరుగుతుంది. అందులో మొదటిది రాత పరీక్ష, రెండవది స్కిల్‌ టెస్ట్, చివరిది డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.