గౌతమ్ కృష్ణ.. ‘రియల్’ హీరో బయోపిక్.

బిగ్ బాస్ సీజన్ 7 అండ్ 8 లో సందడి చేశాడు గౌతమ్ కృష్ణ. డాక్టర్ కం యాక్టర్ అయిన ఇతను అంతకుముందు ఆకాశ వీధుల్లో సినిమా చేశాడు. ఆ సినిమాలో పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించింది.


ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 లో ఛాన్స్ అందుకున్నాడు. ఆ సీజన్ లో శివాజికి టఫ్ ఫైట్ ఇస్తూ తన సత్తా చాటాడు. అశ్వద్ధామ వచ్చాడంటూ బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూం కి వెళ్లి మళ్లీ వచ్చాడు గౌతమ్ కృష్ణ.

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ..

ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గౌతమ్ కృష్ణ మళ్లీ హౌస్ లోకి వచ్చాడు. సీజన్ 8 రన్నరప్ గా గౌతమ్ కృష్ణ సత్తా చాటాడు. దాదాపు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. గౌతమ్ కృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ కటౌట్ ఆడియన్స్ కు నచ్చేసింది. బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయిన గౌతమ్ కృష్ణ ఈమధ్యనే సోలో బాయ్ సినిమా చేశాడు. ఆ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.

ఐతే లేటెస్ట్ గా గౌతమ్ కృష్ణ రియల్ హీరో బయోపిక్ తో వస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన ఆర్మీ ఆఫీసర్ మురళి నాయక్ బయోపిక్ తో గౌతమ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో కె సురేష్ బాబు నిర్మిస్తున్నారు. సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. సినిమా నుంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

సోలో బాయ్ సినిమా..

గౌతమ్ కృష్ణ మురళి నాయక్ బయోపిక్ లో నటిస్తున్నాడు. తన సోలో బాయ్ సినిమా టైం లోనే మురళి నాయక్ ఫ్యామిలీని కలిశా.. ఆయన బయోపిక్ చేస్తున్నామని మురళి నాయక్ తల్లిదండ్రులకు చెప్పాం. వాళ్లు కూడా చేయండని చెప్పారని గౌతమ్ కృష్ణ చెప్పుకొచ్చారు.

మురళి నాయక్ ఆర్మీలో వెళ్లేందుకు ఎంత కృషి చేశాడు. అతని బాల్యం నుంచి ఆర్మీ లో జాయిన్ అయిన విధానం.. ఇక తను చేసిన సేవలు. ఆపరేషన్ సింధూర్ కి అతను రెడీ అయిన విధానం.. చివరగా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తీరు అంతా కూడా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. గౌతమ్ కృష్ణ ఛాయిస్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. దేశం మొత్తం గర్వపడేలా చేసిన వీర సైనికుడి కథతో గౌతమ్ కృష్ణ చేస్తున్న ఈ అటెంప్ట్ అతనికి మంచి పేరు తెచ్చి పెడుతుందేమో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.