ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ప్రమాదాల జరుగుతున్నాయి.
తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో కూడా ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అందరూ కూడా మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్పాట్‌లోనే 71 మంది మృతి..
ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాబూల్‌కు బహిష్కరించిన వలసదారులను తీసుకెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న 71 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు. వీరిలో 17 మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే బస్సు డ్రైవర్ అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలోని వెళ్లిన బాధితులను రక్షించలేకపోయారు. అప్పటికే బస్సు మొత్తం సజీవదహనమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

































